iDreamPost
android-app
ios-app

గుప్పెండ మనసు సీరియల్‌కు రిషి గుడ్ బై..!

  • Published Dec 13, 2023 | 12:11 PM Updated Updated Dec 13, 2023 | 12:26 PM

Guppedantha Manasu Fame Rushi (Mukesh Gowda): తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ మహిళలను అలరిస్తూనే ఉన్నాయి. మహిళలే కాదూ మగపుంగవులు సైతం ఈ సీరియల్స్ కు ఎడిక్ట్ అవుతున్నారు. అంతలా కట్టిపడేస్తున్నాయి ఈ ధారావాహికలు. అటువంటి వాటిలో ఒకటి గుప్పెడంత మనసు కూడా.

Guppedantha Manasu Fame Rushi (Mukesh Gowda): తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ మహిళలను అలరిస్తూనే ఉన్నాయి. మహిళలే కాదూ మగపుంగవులు సైతం ఈ సీరియల్స్ కు ఎడిక్ట్ అవుతున్నారు. అంతలా కట్టిపడేస్తున్నాయి ఈ ధారావాహికలు. అటువంటి వాటిలో ఒకటి గుప్పెడంత మనసు కూడా.

  • Published Dec 13, 2023 | 12:11 PMUpdated Dec 13, 2023 | 12:26 PM
గుప్పెండ మనసు సీరియల్‌కు రిషి గుడ్ బై..!

తెలుగు ఇళ్లల్లో సినిమా చూడని మహిళలు ఉంటారేమో కానీ.. సీరియల్ చూడకుండా ఉండలేని నారీమణి లేదంటే అతిశయోక్తి కాదు. టీవీల్లో  వచ్చినప్పుడు చూడకపోయినా సెల్ ఫోన్లలో అయినా, ఓటీటీ ఫ్లాట్ ఫాంలో అయినా ఫాలో అయిపోవాల్సిందే. ఆ రోజు ఆ సీరియల్ మిస్ అయ్యారంటే.. ఫ్రెండ్‌కో, ఆ సీరియల్ రెగ్యులర్ వాచ్ చేసే వాళ్లకో కాల్ చేసి ఓవరాల్ రివ్యూ అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత నింపాదిగా ఎపిసోడ్ చూసేస్తుంటారు. 90ల కాలం నుండి మొదలైన ఈ సీరియల్స్ ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. మహిళల ఆదరణ చూరగొంటూనే ఉన్నాయి. అటువంటి సీరియల్లో ఒకటి గుప్పెడంత మనసు.

మూడేళ్ల క్రితం స్టార్ మాలో ప్రారంభమైన ఈ సీరియల్.. దాదాపుగా వెయ్యి ఎపిసోడ్లకు దగ్గర అవుతుంది. ఇప్పుడు ఈ సీరియల్ హీరో రిషి సార్ (ముఖేష్ గౌడ్) కొన్ని రోజుల నుండి కనిపించడం లేదు. రిషి లేకపోతే.. ఏమైందని ఆందోళన చెందుతున్నారు లేడీ ఫ్యాన్స్. ఎందుకంటే.. ఇదే సీరియల్లో గతంలో రాజమాత అయిన జగతి(జ్యోతిరాయ్) క్యారెక్టర్ కూడా ఉన్నపళంగా తీసేశారు( చంపేశారు లెండి). ఇప్పుడు గత 9 ఎపిసోడ్ల నుండి రిషి తెరపై కనిపించకపోయే సరికి.. జగతిలా అతడు కూడా సీరియల్ నుండి తప్పుకుంటున్నాడా అన్న అనుమానం కలుగుతుంది. ఈ సీరియల్లో అలరించే క్యారెక్టర్లలో ముఖ్యమైనవి రిషి తర్వాత వసు, మహేంద్ర, జగతిలే.

ఈ క్యారెక్టర్ల వల్లే సీరియల్లోని ఎమోషన్లు పండుతున్నాయి. రేటింగ్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు రిషి కూడా ఒక్కసారిగా కనిపించకోవడంతో కలవరపడుతున్నారు అతడి అభిమానులు, ఈ సీరియల్ ఫ్యాన్స్. మామూలుగా సీరియల్లో సైడ్ క్యారెక్టర్లు లేదా హీరోయిన్లను మారుస్తుంటారు. ఇప్పుడు ఏకంగా హీరో రిషి కూడా కనిపించకపోవడంతో.. ఈ సీరియల్ కథానాయకుడు మారే అవకాశాలున్నాయా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అతడు సీరియల్ కు గుడ్ బై చెప్పేశాడా అన్న అనుమానాన్ని వెలిబుచ్చుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఈ బుల్లి తెర కథానాయకుడికి.. వెండి తెరపై మెరిసే అవకాశాలు వస్తున్నాయి.

గీతాశంకరం అనే సినిమాల్లో నటిస్తున్నాడు మన రిషి సార్. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసిన సంగతి విదితమే. ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్చర్ సెట్స్‌పై ఉంది. ఈ షూటింగ్ ఉన్న నేపథ్యంలో ఆ సీరియల్ షూటింగ్‌లో పాల్గొనలేకపోతున్నాడని తెలుస్తోంది. వరుస షెడ్యూల్ ఉండటంతో గుప్పెడంత మనసు సీరియల్‌కు కాస్త బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. సీరియల్ షూటింగ్ అంటే రెగ్యులర్‌గా ఉంటుంది కాబట్టి.. దానికి కాస్త విరామం ఇచ్చి.. సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇది టెంపరరీ బ్రేకా.. లేకా పర్మినెంటా అనేది సీరియల్ చిత్ర యూనిట్, ముఖేష్ గౌడ్ పై ఆధారపడి ఉంటుంది. ఏమో తిరిగి రిషి కనిపించొచ్చు.. కనిపించకపోవచ్చూ.. రిషిని బుల్లితెరపై కొన్ని ఎపిసోడ్ల నుండి మిస్ అవుతున్నారా..? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom