iDreamPost
android-app
ios-app

Rajinikanth: ఇది రజినీ క్రేజ్.. 40 నిమిషాలకు ఏకంగా రూ. 40 కోట్లు

  • Published Feb 09, 2024 | 3:31 PM Updated Updated Feb 09, 2024 | 3:31 PM

సౌత్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకునే వారిలో రజనీకాంత్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంటారు. ఈ క్రమంలో లాల్‌ సలామ్‌ సినిమా కోసం ఆయన తీసుకున్న పారితోషకం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ వివరాలు..

సౌత్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకునే వారిలో రజనీకాంత్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంటారు. ఈ క్రమంలో లాల్‌ సలామ్‌ సినిమా కోసం ఆయన తీసుకున్న పారితోషకం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆ వివరాలు..

  • Published Feb 09, 2024 | 3:31 PMUpdated Feb 09, 2024 | 3:31 PM
Rajinikanth: ఇది రజినీ క్రేజ్.. 40 నిమిషాలకు ఏకంగా రూ. 40 కోట్లు

ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న డిమాండ్‌, క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే కాక విదేశాల్లో సైతం ఆయనకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇక తమిళనాడులో ఆయన అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏడు పదుల వయసులో కూడా యాక్టింగ్‌, డ్యా‍న్స్‌ వంటి అంశాల్లో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు రజనీకాంత్‌. ఇప్పటికి ఆయన సినిమా రిలీజ్‌ అంటే బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామీ పక్కా అని నమ్ముతారు. ఇప్పటికి సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో రజనీకాంతే ముందు వరుసలో ఉంటారు. ఈ క్రమంలో తాజాగా రజనీకాంత్‌ రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఆ వివరాలు..

గతేడాది రజనీకాంత్ నటించిన ‘జైలర్’సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా 700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఆ సినిమాకు రజనీకాంత్‌ ఏకంగా 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ తీసుకున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇక జైలర్‌ సినిమా హిట్టు తర్వాత ఆయన రేంజ్‌ మరింత పెరిగింది. ఇక తాజాగా రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలామ్‌’ చిత్రం నేడు అనగా ఫిబ్ర‌వ‌రి 9, శుక్రవారం నాడు రిలీజ్ అయ్యింది. రజనీ కెరీర్‌లోనే మొదటి సారి ఎలాంటి ప్రమోషన్స్‌ లేకుండా.. బజ్‌, హైప్‌ లేకుండా విడుదలైన సినిమా లాల్‌ సలామ్‌. ఇక ఈ సినిమాకు రజనీ కుమార్తె ఐశ్వర్యనే డైరెక్టర్‌ కావడం విశేషం.

ఈ సినిమాలో రజనీ నటించడం వల్ల దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నేడు రజనీ సినిమా విడుదలవుతుంది అనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఆ సంగతి అలా ఉంచితే.. లాల్‌ సలామ్‌ సినిమాకు రజనీకాంత్ ఎంత పారితోషికం తీసుకున్నారనే దాని గురించి ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఆ ఎమౌంట్‌ చూసి ప్రతి ఒక్కరు షాక్‌ అవుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ‘లాల్ సలామ్’ సినిమాలో రజనీకాంత్ చేసింది మెయిన్ రోల్ కాదు. ఆయన పోషించిన పాత్ర పేరు మొయిద్దీన్ భాయ్.

ఇక సినిమాలో ఆ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. అందుకు గాను రజనీకాంత్‌ ఏకంగా 40 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా అందుకున్నారని కోలీవుడ్‌లో టాక్. అంటే నిమిషానికి కోటి రూపాయల చొప్పున వసూలు చేశారన్న మాట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది రజనీ రేంజ్‌ అంటున్నారు ఈ విషయం తెలిసిన అభిమానులు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş