iDreamPost
android-app
ios-app

వాళ్లు ఎవరు నా గురించి మాట్లాడటానికి.. రేణు దేశాయ్‌ ఫైర్‌!

  • Published Oct 24, 2023 | 11:36 AM Updated Updated Oct 24, 2023 | 11:36 AM

తనను కమాండ్‌ చేయడానికి పవన్‌ ఫ్యాన్స్‌ ఎవరంటూ మండిపడ్డారు. ఒక పొలిటీషియన్‌గా మాత్రమే పవన్‌ ఈ సొసైటీకి అవసరం అని తాను గతంలో చెప్పానన్నారు.

తనను కమాండ్‌ చేయడానికి పవన్‌ ఫ్యాన్స్‌ ఎవరంటూ మండిపడ్డారు. ఒక పొలిటీషియన్‌గా మాత్రమే పవన్‌ ఈ సొసైటీకి అవసరం అని తాను గతంలో చెప్పానన్నారు.

  • Published Oct 24, 2023 | 11:36 AMUpdated Oct 24, 2023 | 11:36 AM
వాళ్లు ఎవరు నా గురించి మాట్లాడటానికి.. రేణు దేశాయ్‌ ఫైర్‌!

రేణు దేశాయ్‌ యాక్టింగ్‌కు సంబంధించి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలో ఓ కీలక పాత్రలో ఆమె నటించారు. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక, సినిమా విడుదలకు ముందునుంచి రేణు దేశాయ్‌ తరచుగా మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పవన్‌ గురించి మాట్లాడటం ఆయన ఫ్యాన్స్‌కు నచ్చటం లేదు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెతో గొడవ పెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. టైగర్‌ నాగేశ్వరరావు సినిమా వల్ల తాను తరచుగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నానని అన్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ తనపై ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫైర్‌ అవుతున్నారని చెప్పారు. పవన్‌ గురించి మాట్లాడకూడదంటూ వార్నింగ్‌ ఇస్తున్నారని అన్నారు. కొంతమంది కావాలనే పని గట్టుకుని మరీ ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. తనకు నచ్చినట్లు తాను ఉంటానని, ప్రశ్నించడానికి వాళ్లు ఎవరు అంటూ మండిపడ్డారు. పవన్‌ గురించి తనకు ఇష్టం ఉంటేనే మాట్లాడతానని స్పష్టం చేశారు.

తనను కమాండ్‌ చేయడానికి పవన్‌ ఫ్యాన్స్‌ ఎవరంటూ మండిపడ్డారు. ఒక పొలిటీషియన్‌గా మాత్రమే పవన్‌ ఈ సొసైటీకి అవసరం అని తాను గతంలో చెప్పానన్నారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. పవన్‌ సీఎం అవుతారా? లేదా? అన్నది తాను కోరుకోనని, అది దేవుడు డిసైడ్‌ చేస్తాడని తెలిపారు. ఒక కామన్‌ వ్యక్తిగా కూడా పవన్‌ వైపు స్టాండ్‌ తీసుకోనని స్పష్టం చేశారు. మరి, రేణు దేశాయ్‌ పవన్‌ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet