iDreamPost
android-app
ios-app

Renu Desai: మహేశ్ మూవీ ఛాన్స్ వదిలేశా.. కారణం చెప్తే గొడవలే: రేణు దేశాయ్

  • Published Oct 20, 2023 | 5:18 PM Updated Updated Oct 20, 2023 | 5:18 PM

దాదాపు 18 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రలో రేణూ ఒదిగిపోయారు. అయితే గతేడాదే రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉందంట. కానీ, వచ్చిన అవకాశాన్ని కొన్ని కారణాల వల్ల వదులుకున్నాను అన్నారు.

దాదాపు 18 ఏళ్ల తర్వాత రేణూ దేశాయ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రలో రేణూ ఒదిగిపోయారు. అయితే గతేడాదే రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వాల్సి ఉందంట. కానీ, వచ్చిన అవకాశాన్ని కొన్ని కారణాల వల్ల వదులుకున్నాను అన్నారు.

  • Published Oct 20, 2023 | 5:18 PMUpdated Oct 20, 2023 | 5:18 PM
Renu Desai: మహేశ్ మూవీ ఛాన్స్ వదిలేశా.. కారణం చెప్తే గొడవలే: రేణు దేశాయ్

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రేణూ దేశాయ్ పేరు వైరల్ అవుతోంది. అందుకు కారణం ఏంటంటే.. 18 ఏళ్ల తర్వాత తిరిగి వెండితెరపై కనిపించారు. మాస్ మహారాజ రవితేజ నటించి టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణూ దేశాయ్ కీ రోల్ ప్లే చేశారు. గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రలో రేణూ దేశాయ్ ఒదిగిపోయారు. స్టువర్టుపురంలో దొంగలు, నేరస్థుల్లో మార్పు తీసుకురావడం.. వారిని జీవితాలను మెరుగు చేయడంలో హేమలత లవణం చేసిన కృషి ఎంతో ఉంది. రీఎంట్రీలో అలాంటి ఒక అభ్యుదయ మహిళ పాత్రలో నటించి రేణూ దేశాయ్ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం కాకుండా మరో వార్తలో రేణూ దేశాయ్ పేరు వైరల్ అవుతోంది.

నిజానికి రేణూ దేశాయ్ గతేడాదే సినిమాల్లో నటించాల్సింది. కానీ, వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నారంట. అందుకు చాలా కారణాలే ఉన్నాయని చెప్పారు. పైగా ఆ కారణాలు ఇప్పుడు చెప్తే పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉందంటూ కామెంట్ చేశారు. అయితే అది మరెవరి సినిమానో కాదు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో నదియా కంటే ముందుగా రేణూ దేశాయ్ కే బ్యాంకు మేనేజర్ రోల్ ఆఫర్ చేశారంట. కథ మొత్తం విన్న తర్వాత రేణూకి ఆ మేనేజర్ పాత్ర బాగా నచ్చిందంట కూడా. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఆ బ్యాంకు మేనేజర్ పాత్రను వదులుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఆ కారణాలను బయట పెడితే పెద్ద పెద్ద కాంట్రవర్సీలు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా అవకాశం గురించి మాట్లాడుతూ.. “సర్కారు వారి పాట సినిమాలో నాకు అవకాశం వచ్చింది. మొదట నన్నే సంప్రదించారు. అందులో యాక్ట్ చేయాలనే ఆసక్తితో నేను ఓకే కూడా చెప్పాను. కానీ, కొన్ని రీజన్స్ వల్ల అది సెట్ కాలేదు. అయితే ఎందుకు కాలేదో ఇప్పుడు మాత్రం చెప్పలేను. ఆ కారణం చెప్పాలని నాకు కూడా ఉంది. దానివల్ల ఇప్పుడు లేనిపోని గొడవలు అవుతాయి. కాంట్రవర్సీలు ఎదుర్కోవాల్సి వస్తుందని సైలెంట్ గా ఉంటేనే బెటర్ అనుకున్నాను” అంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

    • టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ ఇక్కడ చూసేయండి..

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom