iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ ఎందుకింత తొందర !

  • Published Sep 29, 2025 | 10:29 AM Updated Updated Sep 29, 2025 | 10:29 AM

రాజాసాబ్ ఫైనల్ రిలీజ్ డేట్ ను జనవరి 9న ఫిక్స్ చేశారు. సో రిలీజ్ కు ఇంకా మూడు నెలలకు పైగానే సమయం ఉంది. అయినాసరే ప్రమోషన్స్ విషయంలో మాత్రం చాలా అడ్వాన్స్డ్ గా ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా సంబంధించి రెండు ట్రైలర్స్ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. నార్మల్ గా ప్రభాస్ సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి

రాజాసాబ్ ఫైనల్ రిలీజ్ డేట్ ను జనవరి 9న ఫిక్స్ చేశారు. సో రిలీజ్ కు ఇంకా మూడు నెలలకు పైగానే సమయం ఉంది. అయినాసరే ప్రమోషన్స్ విషయంలో మాత్రం చాలా అడ్వాన్స్డ్ గా ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా సంబంధించి రెండు ట్రైలర్స్ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. నార్మల్ గా ప్రభాస్ సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి

  • Published Sep 29, 2025 | 10:29 AMUpdated Sep 29, 2025 | 10:29 AM
రాజాసాబ్ ఎందుకింత తొందర !

రాజాసాబ్ ఫైనల్ రిలీజ్ డేట్ ను జనవరి 9న ఫిక్స్ చేశారు. సో రిలీజ్ కు ఇంకా మూడు నెలలకు పైగానే సమయం ఉంది. అయినాసరే ప్రమోషన్స్ విషయంలో మాత్రం చాలా అడ్వాన్స్డ్ గా ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా సంబంధించి రెండు ట్రైలర్స్ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. నార్మల్ గా ప్రభాస్ సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. రాజాసాబ్ కూడా ఇలాంటి విషయాల్లో నలిగిందే. కానీ అదంతా ఇంతకముందు వరకు.. ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. ఈరోజు సాయంత్రం ఓ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

అలాగే సినిమా రిలీజ్ కు ముందు ఇంకొక ట్రైలర్ రానుంది. ఈ మొదటి ట్రైలర్ మూడున్నర నిమిషాల సేపు ఉండబోతుందంట. అసలు రాజాసాబ్ ఇంత తొందరపడడానికి కారణం ఏంటి అని అందరికి సందేహాలు మొదలయ్యాయి. పైగా ది రాజాసాబ్ బిజినెస్ లెక్కలు ఇంకా మొదలుపెట్టలేదు. ఎంత క్రేజి ఆఫర్స్ వస్తున్నా సరే టిజి విశ్వప్రసాద్ చలించడం లేదట. ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు మారిపోయి.. అవి బిజినెస్ లెక్కలు పెరగడానికి యూజ్ అవ్వడమే కాకుండా.. బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేసి అక్కడ డిమాండ్ ని పెంచే స్ట్రాటజిలో ఇది ఒక భాగం అంట.

దర్శకుడు మారుతికి నార్త్ లో అంత గుర్తింపు లేదు. ఇక్కడ వర్కౌట్ అయ్యేది ప్రభాస్ ఇమేజ్ మాత్రమే. సో ఇక్కడ బిజినెస్ లెక్కలు.. రేట్లు అన్ని ప్రభాస్ బ్రాండ్ మాత్రమే వర్క్ అవుట్ అవుతాయి. అనుకున్నవి అనుకున్నట్టు జరగాలంటే దానికి కాస్త సమయం పడుతుంది. అందుకే ఇప్పటినుంచే సినిమాను ప్రేక్షకులలో స్ట్రాంగ్ గా రిజిస్టర్ చేయడానికి ట్రై చేస్తున్నారు మేకర్స్. సో రాజసాబ్ తొందరపడడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.