iDreamPost
android-app
ios-app

Keerthy Suresh: కీర్తీ సురేశ్ పొలిటికల్ ఎంట్రీ? ఈ చర్చకు అసలు కారణం ఇదే!

Keerthy Suresh: కీర్తీ సురేశ్ పొలిటికల్ ఎంట్రీ? ఈ చర్చకు అసలు కారణం ఇదే!

కీర్తీ సురేశ్.. దక్షిణాదిన మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న హీరోయిన్. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే.. ఉమెన్ లీడ్ రోల్ సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో కీర్తీ సురేశ్ బిజీగా ఉంటోంది. ఉదయనిధి స్టాలిన్ తో కలిసి మామన్నన్ చిత్రంలో నటించింది. ఈ మూవీ ఈనెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే కీర్తీ సురేశ్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కీర్తీ సురేశ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇటీవల కాలంలో పుకార్లు చాలానే వినిపించాయి. తాను లవ్ లో ఉందని.. త్వరలో వివాహం కూడా చేసుకోబోతోంది అంటూ చాలానే ప్రచారాలు జరిగాయి. అలాంటి వార్తలపై స్వయంగా కీర్తీ సురేశ్ కూడా స్పందించింది. అలాంటి వార్తలు చదివితే చాలా బాధగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె విషయంలో మరో వార్త కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే.. కీర్తీ సురేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ చెబుతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు.

గతంలో కూడా కీర్తీ సురశ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తవం అంటూ ఆమె తల్లి క్లారిటీ ఇచ్చారు. మరోసారి ఆ ప్రచారం తెరమీదకు వచ్చింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా అంటూ అందరూ అజుగుతున్నారని.. ఆ విషయం గురించి ఆలోచించాలని తెలిపారు. అంటే వచ్చే విషయంపై ఆలోచన ఉందేమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా మామన్నన్ సినిమా కూడా రాజకీయ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఆ వార్తలకు మరింత ప్రచారం దొరికింది. ఉదయనిధి స్టాలిన్ కు మంచి స్నేహితురాలు కావడంతో పొలిటికల్ ఎంట్రీ పక్కా అయ్యే ఛాన్స్ లేకపోలేదు అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom