OTTలో రవితేజ మూవీ అరుదైన ఘనత! ఇండియాలోనే మెుదటి చిత్రంగా రికార్డ్!

OTTలో మాస్ మహారాజా నటించిన ఓ మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దాంతో ఈ రికార్డ్ సాధించిన తొలి ఇండియన్ చిత్రంగా ఆ చిత్రం నిలిచింది. మరి ఆ సినిమా ఏది? ఆ రికార్డ్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

OTTలో మాస్ మహారాజా నటించిన ఓ మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దాంతో ఈ రికార్డ్ సాధించిన తొలి ఇండియన్ చిత్రంగా ఆ చిత్రం నిలిచింది. మరి ఆ సినిమా ఏది? ఆ రికార్డ్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎప్పుడైతే ఓటీటీలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయో.. అప్పటి నుంచి సినిమాలు చూసే వారి ఆలోచనా విధానం మారిపోయింది. వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు, సినిమాలు ఇలా తమకు నచ్చినవి చూసుకునే వెసులుబాటు ఓటీటీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాస్ మహారాజ రవితేజ గతేడాది నటించిన టైగర్ నాగేశ్వరరావు ఓటీటీలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అమెజన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఆ రికార్డ్ సాధించిన మెుదటి చిత్రంగా ఘనత వహించింది. మరి ఇంతకీ రవితేజ మూవీ సాధించిన ఆ రికార్డ్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

స్టువర్ట్ పురం గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా గతేడాది తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజా టైటిల్ రోల్ పోషించగా.. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. డైరెక్టర్ వంశీకృష్ణ పాన్ ఇండియా లెవల్లో తీసిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం సరికొత్త వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది సంస్థ.

టైగర్ నాగేశ్వరరావు మూవీని ఇండియన్ సైన్ లాగ్వేజీలో అందుబాటులోకి తెచ్చింది అమెజాన్ ప్రైమ్. దీని ద్వారా వినికిడి శక్తి లేని వాళ్లు సైతం ఈ వెర్షన్ లో మూవీని చూసి ఎంజాయ్ చేయెుచ్చు. మూవీలో ప్రతి డైలాగ్ ని ఎక్స్పర్ట్ సైన్ లాగ్వేజీలో వివరిస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటుగా.. ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు. తద్వారా సైన్ లాగ్వేజీలో అందుబాటులో ఉన్న తొలి ఇండియన్ సినిమాగా టైగర్ నాగేశ్వరరావ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం కూడా ఈ లాగ్వేజీలో అందుబాటులో లేదు. మరి దివ్యాంగుల కోసం ఇంత మంచి పనిచేసి సినిమాను సైన్ లాగ్వేజీలోకి అందుబాటులోకి తెచ్చిన అమెజాన్ ప్రైమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మరి టైగర్ నాగేశ్వరరావు మూవీ ఈ ఘనత సాధించి తొలి చిత్రంగా నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments