iDreamPost
android-app
ios-app

Ravi Teja: RT 75కి క్రేజీ టైటిల్ ఫిక్స్? మాస్ మహారాజా భలే పట్టేశాడే..

  • Published Aug 10, 2024 | 4:25 PM Updated Updated Aug 10, 2024 | 4:25 PM

మాస్ మహారాజా వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఏడాదికి రెండు, మూడు చిత్రాలు విడుదల చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా తన 75వ సినిమాలో పాల్గొంటున్నాడు. ఇక ఈ మూవీకి ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మాస్ మహారాజా వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఏడాదికి రెండు, మూడు చిత్రాలు విడుదల చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా తన 75వ సినిమాలో పాల్గొంటున్నాడు. ఇక ఈ మూవీకి ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 10, 2024 | 4:25 PMUpdated Aug 10, 2024 | 4:25 PM
Ravi Teja: RT 75కి క్రేజీ టైటిల్ ఫిక్స్? మాస్ మహారాజా భలే పట్టేశాడే..

సినిమాకు టైటిల్ పెట్టడం అనేది ఓ కళ. ఆ కళ అందరికీ ఉండదు. మూవీ పేరు చూడాగానే ప్రేక్షకుడు అబ్బా ఏముందిరా అన్నట్లుగా ఉండాలి. ఇక్కడి నుంచే డైరెక్టర్ మార్కులు కొట్టేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రస్తుతం మేకర్స్ కూడా సినిమా కథకు తగ్గట్లుగా అద్భుతమైన టైటిల్స్ ను పెడుతూ వస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ 75వ సినిమాకు ఓ టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఎనర్జిటిక్ హీరో భలే టైటిల్ పట్టేశాడే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మాస్ మహారాజా వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఏడాదికి రెండు, మూడు చిత్రాలను రిలీజ్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాాజాగా తన 75వ మూవీకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రానికి ‘సామజవరగమన’ మూవీకి రైటర్ గా పనిచేసిన భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా కొత్తగా ఉండే కథతో రవితేజను సరికొత్తగా ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి ఓ సూపర్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. రవితేజ 75 చిత్రానికి ‘కోహినూర్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది వర్కింగ్ టైటిల్ గానే చిత్ర యూనిట్ చెబుతుంది.

RT75

కాగా.. రవితేజ నుంచి మాస్ టైటిల్స్, క్యాచీ టైటిల్స్ తో వచ్చిన సినిమాలు మంచి హిట్స్ సాధించాయి. దాంతో ఇప్పుడు ఈ చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఈ మూవీలో ధమాకా బ్యూటీ శ్రీలీల మరోసారి మాస్ మహారాజాతో జతకట్టబోతోంది. ఈ కాంబోకి ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. భీమ్స్ సిసిరిలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సంక్రాంతికి పోటీ ఉన్నప్పటికీ.. రవితేజకు ఈ పండగ కలిసొస్తుంది అన్నది మేకర్స్ భావన. మరి రవితేజ 75వ సినిమా వర్కింగ్ టైటిల్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetsmove girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom