Krishna Kowshik
శ్రీను వైట్ల, రవితేజ కాంబోలో వచ్చిన మూవీ వెంకీ. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అలాగే కామెడీ ట్రాక్ ఎప్పుడు చూసినా రీ ప్రెష్ గా ఉంటుంది. ఇందులో నెగిటివ్ రోల్ పోషించిన నటుడు గుర్తున్నాడా.. తెలుగు సినిమాల నుండి దూరం ఎందుకు జరిగాడంటే..?
శ్రీను వైట్ల, రవితేజ కాంబోలో వచ్చిన మూవీ వెంకీ. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అలాగే కామెడీ ట్రాక్ ఎప్పుడు చూసినా రీ ప్రెష్ గా ఉంటుంది. ఇందులో నెగిటివ్ రోల్ పోషించిన నటుడు గుర్తున్నాడా.. తెలుగు సినిమాల నుండి దూరం ఎందుకు జరిగాడంటే..?
Krishna Kowshik
కామెడీ పండించడంలో సెపరేట్ ట్రాక్ ఏర్పాటు చేసిన స్టార్ హీరో భూపతి రాజు రవి శంకర్ రాజు. ఈయనెవరు అనుకుంటున్నారా అదేనండీ మన రవితేజ. మాస్ మహారాజా అయినప్పటికీ ఆయన కామెడీ టైమింగే వేరు. అందుకు ఉదాహరణ వెంకీ మూవీ. 2004లో తెరకెక్కించిన ఈ మూవీ దగ్గర బాక్సాఫీసు దగ్గర బిగ్ హిట్ అందుకుంది. వెంకీ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత ఏడాది చివరిలో రీ రిలీజ్ చేసినా కూడా ప్రేక్షకులు హౌస్ ఫుల్ చేశారంటే చెప్పుకోవచ్చు ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందో. శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా.. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. ఈ చిత్రం ఎంత సస్పెన్స్ క్రియేట్ చేస్తుందో.. అంత ఫన్ అందిస్తుంది. స్పెషల్‌గా ఆ ట్రైన్ ఎపిసోడ్ ఇప్పటికీ, ఎప్పటికీ మూవీ లవర్స్‌కి స్పెషలే ఎపిసోడ్.
ఇందులో రవితేజ, స్నేహ హీరో హీరోయిన్లుగా నటించగా.. శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, రామచంద్ర, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణు మాధవ్ కీ రోల్స్ చేశారు. ఈ గ్యాంగ్ చేసే హడావుడి, బ్రహ్మనందం, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇక అక్కడ కామెడీ ట్రాక్ కాగానే.. పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడమీలో చేరతారు వీరంతా. అక్కడ నుండి అసలు సమస్య మొదలు అవుతుంది. వీరికి ఐపీఎస్ యోగేంద్ర శర్మ ట్రైనింగ్ ఇస్తాడు. చాలా స్ట్రిక్ట్ పోలీసాఫీసర్ పాత్రలో నటించాడు. ఆ తర్వాతే తెలుస్తుంది. హీరోయిన్ తండ్రిని చంపించింది ఇతడే అని. అందులో పోలీస్ దుస్తుల మాటున విలన్‌గా నటించిన ఆ నటుడు ఎవరో కాదు అశుతోష్ రాణా. తన విలనిజంతో మంచి మార్కులు పొందాడు. తెలుగులో వరుస అవకాశాలు కొల్లగొట్టాడు.
కానీ 2019 నుండి ఆయన తెలుగు సినిమాలు చేయలేదు. వెంకీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ విలన్.. బంగారం మూవీలో భూమా రెడ్డిగా నటించాడు. ఆ తర్వాత ఒక్కమగాడు, విక్టరీ, బలుపు, తడాఖా, పటాస్, కొరియర్ బాయ్ కళ్యాణ్, కృష్ణాస్టమి, నేనే రాజు నేనే మంత్రి, జై సింహ, సాక్ష్యం, విశ్వమిత్ర..రాజశేఖకర్ కల్కిలో నటించాడు. అక్కడ నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇప్పుడు కన్నడ, హిందీ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఫైటర్ మూవీతో పలకరించాడు అశుతోష్ రాణా. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. ఇక ఆయన భార్య కూడా మన తెలుగు వారికి సుపరిచితమే. రేణుకా సహనే మనీ, మనీ మనీ మూవీలో రేణు పాత్రలో నటించింది. సల్మాన్, మాధురి దీక్షిత్ నటించిన హమ్ అప్కే హై కౌన్ (ప్రేమాలయం) చిత్రంలో హీరోకు వదినగా నటించింది అశుతోష్ రానా భార్యనే. మళ్లీ అశుతోష్ తెలుగులో కనిపిస్తారేమో చూద్దాం.