iDreamPost
android-app
ios-app

వీడియో: ఒళ్లు గగుర్పొడిచేలా ఈగల్ యాక్షన్ ట్రైలర్!

  • Published Feb 07, 2024 | 4:29 PM Updated Updated Feb 07, 2024 | 4:29 PM

Ravi Teja Eagle Movie: మాస్ మహారాజ రవితే ఈగల్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ఒక యాక్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Ravi Teja Eagle Movie: మాస్ మహారాజ రవితే ఈగల్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ఒక యాక్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

  • Published Feb 07, 2024 | 4:29 PMUpdated Feb 07, 2024 | 4:29 PM
వీడియో: ఒళ్లు గగుర్పొడిచేలా ఈగల్ యాక్షన్ ట్రైలర్!

మాస్ మహారాజా నుంచి వస్తున్న ఈగల్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి చాలానే అప్ డేట్స్ వచ్చాయి. ట్రైలర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే మాస్ రాజా ఈ మూవీ ఫైనల్ కాపీని చూసి తన రివ్యూ కూడా చెప్పేశారు. సినిమా అదిరిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాజాగా ఈగల్ మూవీ నుంచి ఇంకో అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత మూవీపై అంచనాలు నెక్స్ లెవల్ కి వెళ్లాయి.

ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. రవితేజ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన తర్వాత ఆ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈగల్ టీమ్ మూవీపై హైప్ ని పెంచే ఇంకో పని చేసింది. అదేంటంటే.. “పద్ధతైన దాడి” అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ ట్రైలర్ అనుకోవచ్చు. ఈగల్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఏ స్థాయిలో ఉండబోతోంది అనే విషయాన్ని ఒక శాంపిల్ వీడియోలో చూపించారు. ఈ వీడియోలో మీకు 20 నుంచి 30 రకాల వెపన్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా స్టోరీ మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది.

రవితేజ ఒక అడవిలో ఉంటాడు. అది అతని సామ్రాజ్యం. అతడిని బయటకు తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నించి ఓడిపోతారు. అయితే అసలు రవితేజ ఎవరు? అతను మోస్ట్ వాంటెడ్ గా ఎందుకు మారాడు? అసలు అతను ఏం చేస్తాడు? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఫిబ్రవరి 9న ఈగల్ సినిమా చూడాల్సిందే. ఈ యాక్షన్ ట్రైలర్ లో రవితే స్వాగ్ మాత్రమే కాకుండా.. యాక్షన్ లో విశ్వరూపం చూపించారు. మరి.. ఈగల్ మూవీ యాక్షన్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet