iDreamPost
android-app
ios-app

Purushothamudu Trailer: రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ ట్రైలర్! రాముడు లాంటోడు అంటా!

  • Published Jul 19, 2024 | 2:52 PM Updated Updated Jul 19, 2024 | 2:52 PM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ గా నటించిన మూవీ 'పురుషోత్తముడు'. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్లు కనిపిస్తోంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ గా నటించిన మూవీ 'పురుషోత్తముడు'. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్లు కనిపిస్తోంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

  • Published Jul 19, 2024 | 2:52 PMUpdated Jul 19, 2024 | 2:52 PM
Purushothamudu Trailer: రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ ట్రైలర్! రాముడు లాంటోడు అంటా!

రాజ్ తరుణ్.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక రాజ్ తరుణ్ నుంచి లేటెస్ట్ గా వస్తున్న మూవీల్లో ఒకటి ‘పురుషోత్తముడు’. ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకత్వం వహించగా.. హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కనిపిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

రాజ్ తరుణ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు అన్నీ దాదాపు ఫ్యామిలీ ఎంటర్ టైనర్సే. ఇప్పుడు వస్తున్న పురుషోత్తముడు కూడా ఆ జానర్ లోదే అని తెలుస్తోంది. ఓ ఊరికి వచ్చిన సమ్యను ముందుండి తీర్చే వ్యక్తిగా రాజ్ తరుణ్ ఇందులో కనిపించబోతున్నాడని అర్దం అవుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినప్పటికీ.. యాక్షన్స్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే అక్కడక్కడ సూపర్ స్టార్ మహేశ్ బాబు శ్రీమంతుడు, మహర్షి టచ్ కనిపిస్తోంది. రాజ్ తరుణ్ రిచ్ పర్సన్ గా కనిపిస్తూనే తనను నమ్ముకున్న ఊరుకోసం ఏం చేశాడు? అన్నది తెరపైనే చూడాలి. ఇందులో అతడి క్యారెక్టర్ గురించి చివర్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్ అందరిని ఆలోచింపజేస్తుంది. మెుత్తానికి రాజ్ తరుణ్ ను ఇందులో రాముడిలాంటోడు అంటూ డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేశాడు.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ఈసారి ఈ యంగ్ హీరో హిట్ కొట్టేలా ఉన్నాడు. పైగా ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం, ముఖేశ్ ఖన్నా లాంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండటం అదనపు బలం. ఇక డైరెక్టర్ రామ్ భీమన విషయానికి వస్తే.. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గోపి సుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. జూలై 26న పురుషోత్తముడు థియేటర్లలో సందడి చేయనున్నాడు. మరి ఈ ట్రైలర్ చూసి.. ఎలా ఉందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş