iDreamPost
android-app
ios-app

హీరోతో ముద్దు అనుభవంపై రవీనా టాండన్‌ షాకింగ్‌ కామెంట్లు!

  • Published Sep 28, 2023 | 6:40 PM Updated Updated Sep 28, 2023 | 6:40 PM
  • Published Sep 28, 2023 | 6:40 PMUpdated Sep 28, 2023 | 6:40 PM
హీరోతో ముద్దు అనుభవంపై రవీనా టాండన్‌ షాకింగ్‌ కామెంట్లు!

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘రవీనా టాండన్‌’. 1993లో వచ్చిన ‘రథ సారధి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారీమె. తెలుగులో నాలుగైదు సినిమాలు చేశారు. చివరగా తెలుగులో 2014లో వచ్చిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో కనిపించారు. 1991లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో సినిమాలు చేశారు. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ విషయాలను ఆమె చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. తాజాగా, ముద్దు సీన్‌ అనుభవం గురించి ఆమె మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో ముద్దు సీన్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ ‘‘ ఆరోజుల్లో ఇప్పటిలా కాంట్రాక్ట్‌లు ఏవీ ఉండేవి కావు. నేను ఎప్పుడూ ముద్ద సీన్‌లలో నటించలేదు. అవి నాకు సౌకర్యంగా అనిపించేవి కావు. అందుకే ముద్దు సీన్లు చేయనని ఖరాఖండిగా చెప్పేదాన్ని. ఓ సారి ఓ హీరోతో క్లోజప్‌ సీన్‌ చేస్తూ ఉన్నాను. నా ముఖం, హీరో ముఖం చాలా దగ్గరగా వచ్చాయి. అప్పుడు అతడి పెదాలు, నా పెదాలతో తాకాయి.

అది కూడా పొరపాటున జరిగింది. అంతే.. నాకు ఏదోలా అనిపించింది. నేను వెంటనే నా రూముకు వెళ్లిపోయాను. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాను. వాంతి కూడా చేసుకున్నాను. నోరు కడుక్కున్నా.. అయినా నా ఆలోచనలు ఆగిపోలేదు. నూరు సార్లు పెదాలు కడుక్కోవాలని అనిపించింది’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, కేజీఎఫ్‌ 2 సినిమాలో ప్రధాని పాత్రకు గాను ఆమెకు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ వచ్చింది. ఈమె నటనకు అన్ని వర్గాలనుంచి మంచి అప్రిషియేషన్‌ లభించింది. మరి, రవీనా టాండన్‌ ముద్దు అనుభవంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio