iDreamPost
android-app
ios-app

నా భర్తతో రష్మిక అద్భుతంగా నటించింది : అలియా భట్

  • Published Dec 02, 2023 | 3:55 PM Updated Updated Dec 02, 2023 | 3:55 PM

యానిమల్ మూవీ రూపంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి మరో హిట్ అందించాడు టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. సినిమా విడుదలై పాజిటివ్ టాక్, రివ్యూస్ తో దూసుకెళ్లిపోతుంది. ఈ మూవీ ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది. ఫ్యాన్సే కాదూ.. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నటి అలియా

యానిమల్ మూవీ రూపంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి మరో హిట్ అందించాడు టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. సినిమా విడుదలై పాజిటివ్ టాక్, రివ్యూస్ తో దూసుకెళ్లిపోతుంది. ఈ మూవీ ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది. ఫ్యాన్సే కాదూ.. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నటి అలియా

  • Published Dec 02, 2023 | 3:55 PMUpdated Dec 02, 2023 | 3:55 PM
నా భర్తతో రష్మిక అద్భుతంగా నటించింది : అలియా భట్

బాక్సాఫీసును షేక్ చేసేస్తున్న మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైన సంగతి విదితమే. ఫస్ట్ షో నుండే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ నడిచింది. మంచి రివ్యూలు వచ్చాయి. అబ్బా ఏం తీశారు సార్ అంటూ సందీప్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ప్రేక్షకులు. తొలి రోజే ఓవరాల్‌గా 115 కోట్లను కొల్లగొట్టిందని ఇండస్ట్రీ టాక్. రణబీర్- రష్మికల యాక్టింగ్, బాబీడియోల్ విలనిజం, థియేటర్లు దద్దరిల్లేలా చేస్తున్నాయి. ఇక పోతే బాలీవుడ్ సైతం ఈ టేకింగ్ స్టైల్ చూసి మెస్మరైజ్ అయిపోతున్నారు. ఈ పిక్చర్స్‌ను చూసి అభిమానులే కాదూ మన హీరో రణబీర్ భార్య, నటి అలియా భట్ సైతం ఆనంద ఢోలికల్లో తేలియాడుతున్నారు.

ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్‌తో సినిమా ఆసాంతం ఆకట్టుకుంటుంది. ఈ మూవీపై పెట్టుకున్న అంచనాలు వమ్ము చేయలేదు దర్శకుడు. ట్రైలర్‌తో మొదలైన అరాచకం.. సినిమా విడుదలైన తర్వాత కూడా కొనసాగుతోంది. ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో పాటు తనకు నచ్చడంపై ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది అలియా భట్. ‘సందీప్ రెడ్డి వంగా మీలా ఎవరు లేరు, ఈ సినిమాలో బీట్స్ షాకింగ్‌, ఆశ్చర్యానికి గురిచేశాయి. గూస్ బంప్స్ వచ్చాయనుకోండి. రష్మిక ఇక ఈ సినిమాలో చాలా బాగున్నారు. మీ పాత్రకు న్యాయం చేశారు. నా భర్తతో నటించిన ఓ సన్నివేశంలో మీ ప్రేమలో పడిపోయానంతే. చాలా స్ఫూర్తిగా అనిపించింది.నేనైతే క్రష్మిక క్లబ్‌లో చేరిపోయా’ అంటూ రష్మికపై తన ఇష్టాన్ని తెలిపారు అలియా.

ఇక బాబీడియోల్, అనిల్ కపూర్, ఇతర తారాగణం మొత్తం సినిమాకు ప్రాణం పోశారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా హోల్ టీంకు కంగ్రాట్యులేషన్ తెలిపారు. అలాగే తన భర్తను కూడా పొగుడుతూ మరో పోస్టు పెట్టారు. అయితే సహజంగా తన సహనటిని, మరో హీరోయిన్ పొగడటం చాలా అరుదు. అదీ కూడా ఇద్దరూ టాప్ హీరోయిన్లు కాంప్లిమెంట్ ఇచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ నేషనల్ క్రష్ రష్మికను ఇష్టపడుతున్న వారిలో తాను చేరిపోయానంటూ ఆలియా పేర్కొనడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీట్ పెంచుతోంది. సౌత్ సినిమాల నుండి వెళ్లిన మన కన్నడ బ్యూటీ రష్మిక.. బీటౌన్ ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంటే మాటలు కాదు. ఈ మూవీ హిట్‌తో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ ఓ టాప్ హీరోయిన్ ను మరో నటి పొగడటం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişholiganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetdamabet girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet