iDreamPost
android-app
ios-app

వీడియో: వాటర్ ఫాల్స్ కింద తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న రష్మిక..!

  • Published Apr 24, 2024 | 10:31 AM Updated Updated Apr 24, 2024 | 10:38 AM

Rashmika Mandanna Video: కిరిక్ పార్టీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఇప్పుడు నేషనల్ క్రిష్ గా పేరు తెచ్చుకుంది. వరుసగా పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్న ఈ అమ్మడు అభిమానులకు ఎర్త్ డే శుభాకంక్షలు తెలిపింది.

Rashmika Mandanna Video: కిరిక్ పార్టీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఇప్పుడు నేషనల్ క్రిష్ గా పేరు తెచ్చుకుంది. వరుసగా పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తున్న ఈ అమ్మడు అభిమానులకు ఎర్త్ డే శుభాకంక్షలు తెలిపింది.

  • Published Apr 24, 2024 | 10:31 AMUpdated Apr 24, 2024 | 10:38 AM
వీడియో: వాటర్ ఫాల్స్ కింద తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న రష్మిక..!

జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేవు. చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ అమ్మడి అందం, అభినయానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక మొదట మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. 2016 లో కిరిక్ పార్టీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఛలో’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత గీతాగోవిందం మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పటి వరకు తెలుగులో ఎంతోమంది కన్నడ హీరోయిన్లు వచ్చారు. చాలా తక్కువ మంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు.  ‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక మందన తర్వాత తమిళ, హిందీ భాషల్లో వరుసగా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ వైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్ లో నటిస్తుంది. ఇటీవల పాన్ ఇండియా మూవీస్ పుష్ప, యానిమల్ మూవీస్ తో షేక్ చేసిన రష్మిక తాజాగా ప్రకృతిలో హాయిగా సేద తీరుతుంది. ఎర్త్ డే సందర్భంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తెల్లటి బ్రాలెట్, స్కర్ట్స్ వేసుకొని వాటర్ ఫాల్స్ కింద నిలబడి తడిసి ముద్దైంది. జలపాతం కింత తడిస్తున్నట్లు నేచురల్ ఫీలింగ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో షేర్ చేస్తూ తన అందరికీ ఎర్త్ డే శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

2021 లో సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మక అద్భుతంగా నటించింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప బాక్సాఫీష్ షేక్ చేసింది. ఈ చిత్రం సీక్వెల్ పుష్ప 2 : ది రూల్ షూటింగ్ జరుగుతుంది. పుష్ప 2 లో రష్మిక పాత్ర మరింత కీలకంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ సింగ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘యానిమల్’కూడా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక షేర్ చేసిన వీడియో కి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap