iDreamPost
android-app
ios-app

Rashmika Mandanna: ఆ టైమ్ లో విజయ్ దేవరకొండను చూసి భయపడ్డాను: రష్మిక మందన్న

  • Published Jul 25, 2024 | 10:53 AM Updated Updated Jul 25, 2024 | 10:53 AM

టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ పెయిర్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న. ఈ జోడీ ఆన్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటారు. అయితే ఆ సమయంలో విజయ్ ను చూసి భయపడ్డానని రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ పెయిర్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న. ఈ జోడీ ఆన్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటారు. అయితే ఆ సమయంలో విజయ్ ను చూసి భయపడ్డానని రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 25, 2024 | 10:53 AMUpdated Jul 25, 2024 | 10:53 AM
Rashmika Mandanna: ఆ టైమ్ లో విజయ్ దేవరకొండను చూసి భయపడ్డాను: రష్మిక మందన్న

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ కెమిస్ట్రీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం తెలియనిది కాదు. తమ కాంబోతో ఫిదా చేసిన హిట్ పెయిర్ ను మరోసారి వెండితెరపై చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అలాంటి పెయిర్స్ టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అందులో మోస్ట్ క్రేజీయెస్ట్ పెయిర్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న. ఈ జోడీ ఆన్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక, విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ టైమ్ లో రౌడీ హీరోను చూసి భయపడ్డానని చెప్పుకొచ్చింది.

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న.. టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్. ఎన్నిసార్లు చూసినా ఈ పెయిర్ ను మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటారు ఫ్యాన్స్. అదీకాక ఈ జోడీగి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను తమ కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేశారు. అప్పటి నుంచి వీరి ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, వెకేషన్స్ కు కలిసి వెళ్తున్నారన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇద్దరు స్పందించి.. అలాంటిదేమీ లేదని, తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆ న్యూస్ ను కొట్టిపారేశారు.

కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ‘గీత గోవిందం’ షూటింగ్ టైమ్ లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంది. రష్మిక మాట్లాడుతూ..”కొత్త వ్యక్తులతో నేను అంత త్వరగా కలిసిపోను. వారితో మాట్లాడ్డానికి ఇబ్బంది పడతా. అందుకే గీత గోవిందం మూవీ టైమ్ లో తొలిసారి విజయ్ తో నటించేందుకు భయపడ్డాను. కానీ ఆ తర్వాత అతడి వ్యక్తిత్వం తెలిసే కొద్ది ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయాం. అతడు చాలా కూల్ గా ఉంటాడు. సెట్ లో విజయ్ ఉంటే అందరిలో పాజిటీవ్ ఎనర్జీని నింపుతాడు” అంటూ అప్పటి ముచ్చట్లను గుర్తుచేసుకుంది. ఇక ఈ పెయిర్ మరోసారి వెండితెరపై కనిపిస్తే చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş