iDreamPost
android-app
ios-app

Rashmika Mandanna: యానిమల్‌ & పుష్ప 2లకు రష్మిక అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

  • Published Dec 08, 2023 | 5:47 PM Updated Updated Dec 08, 2023 | 5:55 PM

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ గా భారీ చిత్రాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలకు భారీ పారితోషికం అందుకుంటూ ఉంది. తాజాగా యానిమల్ లో నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాకి కూడా రికార్డ్‌ స్థాయిలో పారితోషికం అందుకుందట. ఆ వివరాలు..

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ గా భారీ చిత్రాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలకు భారీ పారితోషికం అందుకుంటూ ఉంది. తాజాగా యానిమల్ లో నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాకి కూడా రికార్డ్‌ స్థాయిలో పారితోషికం అందుకుందట. ఆ వివరాలు..

  • Published Dec 08, 2023 | 5:47 PMUpdated Dec 08, 2023 | 5:55 PM
Rashmika Mandanna: యానిమల్‌ & పుష్ప 2లకు రష్మిక అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

కన్నడ సినీ పరిశ్రమ నుంచి టాలీవుడ్ కు ‘ఛలో’, ‘గీతా గోవిందం’ అంటూ వచ్చిన బ్యూటీ రష్మిక మందన్నాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తక్కువ సమయంలోనే ఏకంగా నేషనల్‌ క్రష్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడం ద్వారా రష్మిక  పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్ గా మారి పోయింది. కన్నడ సినిమాలతో పాటు తెలుగు, తమిళ మరియు హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా సౌత్‌ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో చేరి పోయింది. యానిమల్‌ కి తీసుకున్న పారితోషికం, పుష్ప 2 సినిమాకు రష్మిక తీసుకుంటున్న పారితోషికం గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసే నయనతార సౌత్‌ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విషయం తెల్సిందే.

సాధారణంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు పారితోషికం ఎక్కువ ఉంటుంది. హీరోయిన్స్‌ మొత్తం బాధ్యత మోయాల్సి ఉంటుంది కాబట్టి. వారి ఇమేజ్ పై సినిమా కి జనాల రాక ఆధారపడటంతో పాటు బిజినెస్ లెక్కలూ ఉంటాయి. కనుక అందుకు తగ్గట్లుగా పారితోషికం తీసుకుంటారు ముద్దుగుమ్మలు. కాగా.. నయనతార లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు 4 నుంచి 5 కోట్ల పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే హీరోలకు జోడీగా నటించిన సమయంలో ఆ స్థాయిలో నయన్ పారితోషికం తీసుకోలేదు. కానీ రష్మిక మందన్నా మాత్రం హీరోలతో కమర్షియల్‌ పాత్రల్లో నటించిన సినిమాలకు కూడా ఆ రేంజ్ లో పారితోషికం అందుకుంటూ ఉంది. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం యానిమల్ సినిమాలో నటించినందుకు గాను రష్మిక 4.5 కోట్ల రూపాయల పారితోషికం, స్టాఫ్‌ ఖర్చులు ఇతర ఖర్చులు రూ.50 లక్షల వరకు తీసుకుంది. మొత్తంగా రూ.5 కోట్ల పారితోషికం యానిమల్‌ మేకర్స్‌ రష్మిక కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

rashmika remuneration for animal and pushpa 2 movies

రష్మిక మందన్న తీసుకున్న పారితోషికం కి తగ్గట్లుగానే యానిమల్‌ మూవీలో చాలా కష్టపడిందని చెప్పాలి. రణ్ బీర్ కపూర్ తో కొన్ని సన్నివేశాల్లో ఆమె అద్భుతమైన నటన కనబర్చింది. రొమాంటిక్‌ సన్నివేశాలతో పాటు ఇతర సన్నివేశాల్లో కూడా మెప్పించింది. ఇక రష్మిక మరో ప్రతిష్టాత్మక చిత్రం అయిన పుష్ప 2 లో కూడా నటిస్తోంది. అల్లు అర్జున్‌ కి జోడీగా నటిస్తున్న రష్మిక ఈ చిత్రానికి గాను పారితోషికంగా దాదాపు అయిదు కోట్ల రూపాయలను అందుకుంటుందట. పుష్ప మేకర్స్‌ మొదటి పార్ట్‌ కి ఇచ్చిన పారితోషికం కంటే డబుల్‌ ఇస్తున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. పుష్ప లో శ్రీవల్లి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కనుక ఆ పారితోషికం కు రష్మిక అర్హురాలు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక తాజాగా కమిట్ అయిన ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాకి కూడా రష్మిక నాలుగు కోట్ల నుంచి అయిదు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సౌత్‌ లో భారీ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్‌ జాబితాలో రష్మిక ముందు వరుసలో నిలబడిందని చెప్పుకోవచ్చు. మరి నేషనల్ క్రష్ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişholiganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcratosroyal girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibomHoliganbet