iDreamPost
android-app
ios-app

పాన్ ఇండియా నుండి మీడియం రేంజ్ కి.. ఆ హీరో సరసన రష్మిక!

  • Author ajaykrishna Updated - 11:45 AM, Fri - 13 October 23
  • Author ajaykrishna Updated - 11:45 AM, Fri - 13 October 23
పాన్ ఇండియా నుండి మీడియం రేంజ్ కి.. ఆ హీరో సరసన రష్మిక!

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతున్న టైమ్ లో డౌన్ ఫాల్స్ అనేవి ఎవరి కెరీర్ లో అయినా కామన్. సబ్జెక్టు సెలక్షన్ తప్పుగా ఉండటం వల్లనో.. లేక ఇంకేవైనా కారణాలు ఉండొచ్చు. కానీ.. వాటి నుండి ఎలా బయటికి వచ్చి నిలబడ్డారు అనేది కౌంట్ అవుతుంది. టాలీవుడ్ లో వచ్చిరాగానే వరుస సూపర్ హిట్స్ తో స్టార్డమ్ సంపాదించుకున్న బ్యూటీ రష్మిక మందన. కన్నడ నుండి వచ్చిన ఈ భామ.. మొదటి మూడు సినిమాలతో మంచి పేరు, క్రేజ్ సొంతం చేసుకుంది. కట్ చేస్తే.. అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమా అవకాశం వచ్చింది. సుకుమార్ తెరకెక్కించిన ఆ సినిమా.. పాన్ ఇండియా వైడ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్ అయిపోయింది రష్మిక. అయితే.. రష్మిక డౌన్ ఫాల్ కూడా అక్కడినుండి స్టార్ట్ అయ్యింది. పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ పడ్డాక.. ఎవరైనా తదుపరి ఇంకా బెటర్ హిట్ కొట్టాలని ట్రై చేస్తారు. అయినా.. ఓ పక్క లైఫ్ ఇచ్చిన భాషలో చిన్న సినిమాలైనా చేయకతప్పదు. ఎందుకంటే.. ఇండియా వైడ్ క్రేజ్ వచ్చాక.. లైఫ్ ఇచ్చిన భాషను మర్చిపోయింది అనే కామెంట్స్ వినిపిస్తాయి. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందని ఒకానొక దశలో ఆ ఫీల్ తెప్పించింది రష్మిక. కానీ.. అన్ని భాషలలో సినిమాలు చేయాలనే ఆలోచనలో మంచి అవకాశాలు దూరం చేసుకుంది.

కట్ చేస్తే.. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకుంటుందేమో అని అందరు అనుకున్నారు. కానీ.. రష్మిక చేసిన రెండు హిందీ సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవ్వడం మైనస్ అయ్యింది. ప్రస్తుతం రష్మిక నుండి యానిమల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. పుష్ప తర్వాత చాలా నిరాశపరిచిన రష్మిక.. ఇప్పుడు ఆశలన్నీ యానిమల్ పైనే పెట్టుకుంది. ఎందుకంటే.. పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ప్లాప్ అయినా.. యానిమల్ లాంటి పాన్ ఇండియా మూవీ దొరికింది. కానీ.. ఇప్పుడు యానిమల్ తర్వాత మళ్ళీ మీడియం సినిమా ఓకే చేసింది రష్మిక. అదే విక్కీ కౌశల్ సరసన ‘చావా ది గ్రేట్ వారియర్’. పీరియడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మిక నటించనుంది. అల్లు అర్జున్, రణబీర్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ నుండి మళ్ళీ మీడియం రేంజ్ కి వచ్చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే.. విక్కీ కౌశల్ కూడా ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. మరి అమ్మడి అదృష్టం ఎలా ఉందో చూడాలి. రష్మిక గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş