iDreamPost
android-app
ios-app

పుష్ప-2 నుంచి బిగ్‌ అప్డేట్‌! నేషనల్‌ క్రష్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త!

  • Published Apr 05, 2024 | 12:09 PM Updated Updated Apr 05, 2024 | 12:09 PM

తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా పుష్ప -2 .. ఈ సినిమా మీద అందరికి భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రష్మిక బర్త్ డే సంధర్బంగా ఈ సినిమా నుంచి ఆమె లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా పుష్ప -2 .. ఈ సినిమా మీద అందరికి భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రష్మిక బర్త్ డే సంధర్బంగా ఈ సినిమా నుంచి ఆమె లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 05, 2024 | 12:09 PMUpdated Apr 05, 2024 | 12:09 PM
పుష్ప-2 నుంచి బిగ్‌ అప్డేట్‌! నేషనల్‌ క్రష్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త!

ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఆడియన్సే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ అంతా కూడా.. ఎదురు చూసే సినిమా పుష్ప-2. ఈ సినిమాపై ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్న లుక్స్ అన్ని కూడా ఫ్యాన్స్ కు.. రోజు రోజుకు అంచనాలను పెంచేస్తున్నాయి. సుకుమార్ దర్శకతంలో రాబోతున్న ఈ సినిమా .. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ లుక్ ను రివీల్ చేసిన మేకర్స్.. ఇక ఏప్రిల్ 5న నేషనల్ క్రష్ రష్మిక పుట్టిన రోజు సందర్బంగా ఆమె లుక్ ని కూడా రివీల్ చేశారు. దీనితో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా .. ఈ ఫొటోస్ షికార్లు చేస్తున్నాయి.

2021లో విడుదలైన పుష్ప:ది రూల్ సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే.. ఇప్పటికే టీవీ లో ఈ సినిమా ప్రసారం అవుతుంటే కన్నార్పకుండా చూస్తుంటారు ప్రేక్షకులు. అయితే, ఈ సినిమాలో అల్లు అర్జున్ ను, రష్మికను ఇద్దరినీ కూడా డీ గ్లాసమరస్ గా చూపించారు మేకర్స్. దీనితో రష్మిక ఫ్యాన్స్ కాస్త హార్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2 లో మాత్రం రష్మిక ను ఎంతో అందంగా చూపించాడు దర్శకుడు. ఏప్రిల్ 5న రష్మీక పుట్టిన రోజు సందర్భంగా.. పుష్ప-2 నుంచి రష్మిక లుక్ రివీల్ చేశారు మేకర్స్. దీనితో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిని గ్లామర్ లెస్ గా చూపించారని, ‘పుష్ప -2’లో బ్యూటిఫుల్గా చూపించారంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం పుష్ప-2 లో సినిమాలో రష్మిక లుక్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక పుష్ప -2 సినిమాపై అందరికి ఎటువంటి ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయో తెలియనిది కాదు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ డీల్స్ ను కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బన్నీ బెర్లిన్ కూడా వెళ్లి రావడంతో.. పుష్ప-2 సినిమాపై అందరికి ఇంకాస్త ఎక్స్పెక్టషన్స్ పెరిగిపోయాయి. దీనితో అభిమానులంతా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఈ సినిమాలో సమంత అతిధి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. అలాగే సంజయ్ దత్ కూడా ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. మరి, పుష్ప-2 సినిమా నుంచి రివీల్ అయినా రష్మిక లుక్స్ గురించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet