iDreamPost
android-app
ios-app

ఏ మతం పర్ఫెక్ట్ గా ఉందో చెప్పండి?.. సనాతన ధర్మం వివాదంపై రష్మీ పోస్ట్ వైరల్

  • Published Sep 12, 2023 | 9:17 PM Updated Updated Sep 12, 2023 | 9:17 PM
  • Published Sep 12, 2023 | 9:17 PMUpdated Sep 12, 2023 | 9:17 PM
ఏ మతం పర్ఫెక్ట్ గా ఉందో చెప్పండి?.. సనాతన ధర్మం వివాదంపై రష్మీ పోస్ట్ వైరల్

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సనాతన ధర్మాన్ని శాశ్వతంగా నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెస్తే.. 10 కోట్లు ఇస్తామంటూ ప్రకటనలు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాస్పద అంశంపై బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై రష్మీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది.

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ రగిల్చిన మంటలు ఇంకా చల్లారలేదు. ఏదో ఓ చోట అగ్గి రాజేస్తూనే ఉన్నాయి. తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో సనాతన ధర్మంపై మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రష్మీపై కామెంట్లతో ఏకిపారేస్తున్నారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సనాతన ధర్మంపై దూషనలు ఎక్కువయ్యాయని, హిందూ దేవుళ్లైన అయ్యప్ప, సరస్వతీ దేవీలను దూషిస్తున్నారంటూ వెల్లడించాడు. అన్యమతాలపై మాట్లాడని వారికి హిందువులు పాటించే సనాతన ధర్మంపై మాట్లాడే దైర్యం ఎక్కడిది అంటూ మాట్లాడారు. ఈ వీడియోను రష్మీ పోస్టు చేయడంతో రచ్చ మొదలయ్యింది.

నెటిజన్ల కామెంట్లకు ధీటుగా స్పందించిన రష్మీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాక్, భావ ప్రకటన స్వాతంత్య్రపు హక్కు ఉన్నంత మాత్రాన నా ఇష్టాఇష్టాలపై మీరెందుకు కామెంట్ చేస్తున్నారని అంటూ ప్రశ్నించింది.దేవుడిని ఎందుకు నమ్మరని నేనెవరినీ అడగలేదు..అలాగే నాకు నచ్చిన ధర్మాన్ని నేను పాటిస్తాను.మీకు వచ్చిన సమస్య ఏంటి? అని నెటిజన్లు నిలదీసింది. కుల వివక్షపై మాట్లాడుతున్న మీరు అసలు ఏ మతం పర్ఫెక్టుగా ఉందో చెప్పగలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ పలు సమస్యలపై స్పందించే రష్మీ సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టిన అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet