iDreamPost
android-app
ios-app

రవితేజనే ఫిదా చేసిన వైజాగ్ ర్యాపర్.. ఎవరీ సాయి చరణ్?

Rapper C SHOR Sai Charan: మాస్ మహారాజా రవితేజ చేతనే శభాష్ అనిపించుకున్నాడు ఓ వైజాగ్ కుర్రాడు. ఒకే ఒక్క ర్యాప్ సాంగ్ తో రవితేజ సినీ కెరీర్ ను ఆవిష్కరించాడు. మరి ఆ కుర్రాడు ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Rapper C SHOR Sai Charan: మాస్ మహారాజా రవితేజ చేతనే శభాష్ అనిపించుకున్నాడు ఓ వైజాగ్ కుర్రాడు. ఒకే ఒక్క ర్యాప్ సాంగ్ తో రవితేజ సినీ కెరీర్ ను ఆవిష్కరించాడు. మరి ఆ కుర్రాడు ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రవితేజనే ఫిదా చేసిన వైజాగ్ ర్యాపర్.. ఎవరీ సాయి చరణ్?

ఈగల్.. టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా లేటెస్ట్ గా నటించిన మూవీ. ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్. అయితే ఈ వేడుకలో ఓ తెలుగు ర్యాపర్ దుమ్మురేపాడు. తన పాప్ సింగింగ్ తో ఏకంగా మాస్ మహారాజ చేత శభాష్ అనిపించుకున్నాడు. ఆ ర్యాపర్ పేరే సాయి చరణ్(Cshor). ప్రస్తుతం ఈ కుర్రాడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఒకే ఒక్కపాటతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న ఈ ర్యాపర్ నేపథ్యం ఏంటి? ఓసారి పరిశీలిద్దాం పదండి.

ర్యాప్ సాంగ్స్.. టాలీవుడ్ కు పెద్దగా పరిచయం లేదు. కానీ మన దగ్గరే వరల్డ్ క్లాస్ ర్యాపర్లు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అది కూడా తెలుగు పరిశ్రమలో. అవును మీరు విన్నది నిజమే.. అవకాశాలు రాక, ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక ఇక్కడే ఆగిపోతూ ఉంటారు టాలెంటెడ్ పీపుల్స్. కానీ ఎప్పుడో ఒకసారి.. ఓ అవకాశం అదృష్టంలా తడుపుతడుతుంది. అలాంటి అవకాశమే ఈ వైజాగ్ కుర్రాడిని వరించింది. ఆ కుర్రాడి పేరు సాయి చరణ్.. అభిమానులు ముద్దుగా Cshor అని పిలుచుకుంటారు. తన ర్యాప్ పాటలతో ఇన్ స్టాగ్రామ్ మెుత్తాన్ని ఓ ఊపుఉపుతుంటాడు. కొత్త కొత్త పాటలను క్రియేట్ చేస్తూ.. తనలో ఉన్న టాలెంట్ ను ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు.

తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే గాక.. రవితేజ చేత శభాష్ అనిపించుకున్నాడు ర్యాప్ సింగర్ సాయి చరణ్. రవితేజ లైఫ్ ను ఒకే ఒక్క పాటలో ఎంతో అద్భుతంగా పాడాడు ఈ కుర్రాడు. అతడు పాడుతుంటే రవితేజ సైతం మంత్రముగ్దుడైయ్యాడు అంటే అతిశయోక్తికాదు. రవితేజతో పాటుగా అక్కడికి వచ్చిన ప్రతీ సెలబ్రిటీని తన టాలెంట్ తో మెప్పించాడు. వైజాగ్ కు చెందిన సాయి చరణ్ స్వతహాగా సొంత పాటలు కట్టుకుని పాడుతూ ఉంటాడు. ఈ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. వేలల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. మెల్లగా తన టాలెంట్ ను విస్తృతం చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు ఈ యువ ర్యాపర్.

కాగా.. ఇన్ స్టాగ్రామ్ లో 75 డేస్ ర్యాప్ ఛాలెంజ్ అంటూ అతడు చేసిన పాటలు ఫుల్ క్రేజ్ ను దక్కించుకున్నాయి. చిన్న పదంతో పాటను కట్టి.. దానికి తగ్గట్లుగా సంగీతాన్ని అందించడంలో ఇతడు సిద్దహస్తుడు అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఇదే టాలెంట్ తో ఇండస్ట్రీలోకి శరవేగంగా దూసుకొస్తున్నాడు. ర్యాప్ మ్యూజిక్ లో ఇతడిది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. అందరిలా కాకుండా.. ప్రత్యేకంగా నిలిచేలా పాటలు పాడుతూ ఉంటాడు సాయి చరణ్. ఆ స్పెషల్ టాలెంటే అతడిని రవితేజ దగ్గరికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇతడికి ఇన్ స్టాగ్రామ్ లో 163K ఫాలోవర్స్ ఉన్నారు. మరి ప్రత్యేకమైన ర్యాప్ సంగీతంతో మాస్ మహారాజా చేత శభాస్ అనిపించుకున్న సాయి చరణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by SAI CHARAN (@cshor__)

ఇదికూడా చదవండి: Eagle: ఈగల్ ఫస్ట్ రివ్యూ.. రవితేజ ఆనందం చూశారా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి