iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో పోటీకి రన్వీర్ సింగ్..?

  • Author ajaykrishna Published - 02:48 PM, Thu - 6 July 23
  • Author ajaykrishna Published - 02:48 PM, Thu - 6 July 23
ప్రభాస్ తో పోటీకి రన్వీర్ సింగ్..?

పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చాక హీరోలకు సంబంధించి మార్కెట్స్, ఫ్యాన్ బేస్, థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా, పోటీ అన్ని పెరుగుతూ పోతాయి. పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక.. డార్లింగ్ ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు, తనతో కొలబరేట్ అవ్వడానికి అన్ని ఇండస్ట్రీల స్టార్స్ ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ప్రభాస్ చేతినిండా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లతో.. అమితాబ్, కమల్ హాసన్ లాంటి హేమహేమీలతో వర్క్ చేస్తున్నాడు. అయితే.. ప్రభాస్ తో కొలబరేట్ అవ్వడమో లేదా ప్రభాస్ కి పోటీగా రావడమో చేయాలని స్టార్స్ మనసులలో ఎంతో కొంత అభిప్రాయం ఉంటుంది. కానీ.. ఎవరూ బయటికి చెప్పుకోరు. వారి మధ్య ఫ్రెండ్లీ వాతావరణం దెబ్బ తింటుందేమో అనుకుంటారు.

ఈ విషయంలో స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు ఎవరూ మినహాయింపు కాదు. తాజాగా ప్రభాస్ తో ఒకేసారి కొలబరేట్ అయ్యేందుకు బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ తో కలిసి థియేటర్స్ లో సందడి చేసేందుకు రన్వీర్ రెడీ అయ్యాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రభాస్, రన్వీర్ కాంబినేషన్ లో మూవీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అని ఫ్యాన్స్ లో సందేహాలు మొదలయ్యాయి. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్, రన్వీర్ లకు మధ్య పోటీ మాత్రమే కనిపిస్తుందని అంటున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్.. భారీ యాక్షన్ మూవీ సలార్ ని రెడీ చేస్తున్నాడు. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో పాన్ వరల్డ్ వైడ్ సలార్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా సలార్ నుండి టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే.. ఇదే రోజు రన్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ నుండి టీజర్ రానుందట. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ.. కేజీఎఫ్, సలార్ లకు ఎలాంటి క్రేజ్ ఉందో.. బాలీవుడ్ లో డాన్ సిరీస్ కి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. డాన్, డాన్ 2 మూవీస్ తెరకెక్కించిన ఫర్హాన్ అక్తర్ డాన్ 3 కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే.. డాన్, డాన్ 2 లో నటించిన బాద్షా షారుఖ్ ఖాన్.. డాన్ 3 నుండి తప్పుకోవడంతో ఇందులోకి రన్వీర్ సింగ్ ఎంటర్ అయ్యాడు. మరి డాన్ గా రన్వీర్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇక చాలకాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న రన్వీర్.. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని అనే మూవీ చేశాడు. అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ.. త్వరలో విడుదల కాబోతుంది. మరి ప్రభాస్, రన్వీర్ కాంబో ఎక్సపెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలిందని చెప్పాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet giriş