iDreamPost
android-app
ios-app

వీడియో: లైవ్ లో ప్రర్ఫార్మెన్స్ ఇరగదీసిన యానిమల్ కపుల్!

  • Published Jan 29, 2024 | 6:05 PM Updated Updated Jan 29, 2024 | 6:05 PM

Ranbir Kapoor- Tripti Dimri Live Performance: యానిమల్ సినిమాలో జోయా క్యారెక్టర్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు లైవ్ లో ఈ కపుల్ పర్ఫార్మెన్స్ ఇరగదీశారు.

Ranbir Kapoor- Tripti Dimri Live Performance: యానిమల్ సినిమాలో జోయా క్యారెక్టర్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు లైవ్ లో ఈ కపుల్ పర్ఫార్మెన్స్ ఇరగదీశారు.

  • Published Jan 29, 2024 | 6:05 PMUpdated Jan 29, 2024 | 6:05 PM
వీడియో: లైవ్ లో ప్రర్ఫార్మెన్స్ ఇరగదీసిన యానిమల్ కపుల్!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో యానిమల్ సినిమా పేరు తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా ఇంకా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఓటీటీలోకి రావడంతో ఆ చర్చ మరింత పెరింగింది. ఒక సినిమా ఓవర్ నైట్ స్టార్లను చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యానిమల్ బ్యూటీ తృప్తీ ధిమ్రీ కూడా అలాగే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఈ సినిమాతో వేలల్లో ఉండే ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లు ఏకంగా 48 లక్షలకు చేరారు. ఇప్పుడు ఈ అమ్మడు లైవ్ లో తన సూపర్ హిట్ సాంగ్ కి పర్ఫార్మ్ చేసింది. అది కూడా తన హీరో రణ్ బీర్ కపూర్ తోనే స్టేజ్ మీద డాన్స్ ఇరగదీశారు. ఇప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమా ఒక కథ పరంగానే కాకుండా, యాక్టింగ్, మ్యూజిక్, విజువల్ పరంగా కూడా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అందుకే ఓటీటీలో కూడా యానిమల్ సలార్ లాంటి సినిమాలను కూడా దాటుకుని టాప్ 1గా ట్రెండ్ అవుతోంది. యానిమల్ సినిమా అనగానే అందరికీ రణ్ బీర్ కపూర్, ఆ తర్వాత తృప్తీ ధిమ్రీనే గుర్తొస్తారు. అసలు ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత కథ మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తాయి. అసలు కథ కూడా అక్కడే రివీల్ అవుతుంది. పైగా వీళ్లిద్దరి మధ్య ఒక మంచి రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుంది. అది ఇప్పిటీకీ యానిమల్ మూవీ లవర్స్ హమ్ చేస్తూనే ఉంటారి.

ఆ సాంగ్ మరేదో కాదు.. “ఎవరెవరో నాకెదురైనా.. నువ్ కలిశాకే మొదలైందే” అనే పాట. 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా రణ్ బీర్ కపూర్, తృప్తీ ధిమ్రీ ఈ పాటకు లైవ్ లో పర్ఫామ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో, ఆ ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మూవీలో ఎంత క్యూట్ గా, ఇన్ టెన్సిటీతో నటించారో.. లైవ్ లో కూడా అదే తరహా ప్రదర్శనతో వీళ్లింద్దరూ షో మొత్తాన్ని స్టీల్ చేశారు. వీళ్ల ప్రదర్శన చూసిన స్టార్స్ కూడా వీళ్లను తెగ పొగిడేస్తున్నారు. అంతేకాకుండా.. యానిమల్ చిత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటింది. ఏకంగా 6 అవార్డులు ఈ సినిమాకి దక్కాయి. రణ్ బీర్ కపూర్ కి ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఆ తర్వాత మ్యూజిక్ ఆల్బమ్, బ్యాగ్రౌండ్ స్కోర్ అంటూ మొత్తం 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. థియేటర్లలో రూ.750 కోట్లకు పైగా కలెక్షన్స్ తో అదరగొట్టిన ఈ సినిమా.. ఓటీటీలో సలార్ లాంటి సినిమాలను వెనక్కి నెడుతూ దుమ్మురేపింది.

ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా తన సత్తా ఏంటో చూపించింది. ఈ మొత్తం క్రెడిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకే దక్కుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రణ్ బీర్ కపూర్, రష్మికా మందన్నా, అనీల్ కపూర్, బాబీ డియోల్, తృప్తీ ధిమ్మీ ఇలా ప్రతి క్యారెక్టర్ కి సంబంధించి ఎంతో టాలెంట్ ఉన్న వాళ్లని వెతికి మరీ తీసుకున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి యానిమల్ సినిమా విడుదలై రెండు నెలలు కావొస్తున్నా ఇంకా ఆ సినిమా గురించే మాట్లాడుకునేలా సందీప్ రెడ్డి వంగా చేశాడు. సందీప్ రెడ్డి బాలీవుడ్ సాధిస్తున్న సక్సెస్ చూసి తెలుగు ప్రేక్షకులు కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు. తెలుగు అంటే చిన్నచూపు ఉండే బాలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా.. వారి గురించే ఓపెన్ కామెంట్స్ చేస్తూ.. సినిమా అంటే ఇలా తీయాలి అంటూ చూపిస్తున్నాడు. మరి.. రణ్ బీర్- తృప్తీ లైవ్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom