iDreamPost
android-app
ios-app

SSMB 29 లో రానా ? ఆ కీలక పాత్ర కోసమేనా !

  • Published Oct 15, 2024 | 4:40 PM Updated Updated Oct 15, 2024 | 4:40 PM

రానా దగ్గుబాటి.. ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాలలోనూ కీ రోల్ లో నటిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు జక్కన్న తీయబోయే మరో మూవీలో కూడా రానా ఓ పాత్ర పోషిస్తున్నాడంట. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

రానా దగ్గుబాటి.. ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాలలోనూ కీ రోల్ లో నటిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు జక్కన్న తీయబోయే మరో మూవీలో కూడా రానా ఓ పాత్ర పోషిస్తున్నాడంట. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

  • Published Oct 15, 2024 | 4:40 PMUpdated Oct 15, 2024 | 4:40 PM
SSMB 29 లో రానా ? ఆ కీలక పాత్ర కోసమేనా !

రానా దగ్గుబాటి.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. హీరో, విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ రోల్ అయినా సరే.. రానా తనదైన స్టాండర్డ్ ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. దాదాపు అన్ని ఇండస్ట్రీలలో రానా నటించారు. ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా.. సినిమాలలోని తన పాత్రకు న్యాయం చేస్తూ ఉంటాడు రానా. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. మరో వైపు విలన్ గా కొత్త లుక్స్ లో కనిపిస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు. బాహుబలి తో బల్లాల దేవాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు రానా.. ఇక ఆ తర్వాత రుద్రమ దేవిలో చాణుక్య వీర భద్ర , భీమ్లా నాయక్ లో విలన్ గా.. ఇలా ఎన్నో డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే ఇప్పుడు జక్కన్న తన సినిమా కోసం మరోసారి రానాను ఎంచుకున్నాడట.

ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలియనిది కాదు. SSMB 29 పేరుతో ఈ సినిమా గురించి బజ్ వినిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వం , మహేష్ బాబు హీరో.. ఈ రెండు తప్ప ఇప్పటివరకు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇటీవల మహేష్ లుక్స్ మాత్రం బాగా వైరల్ అయ్యాయి. కానీ , ఆ లుక్స్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు. అలాగే ఈ సినిమాలో మిగిలిన నటీ నటులు ఎవరు.. బడ్జెట్ ఎంత.. లాంటి వివరాలేమీ కూడా తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో రానా కీలక పాత్రలో నటించబోతున్నారనే బజ్ వినిపిస్తుంది. ఆఫ్రికాలోని మాసాయి తెగకు చెందిన ఓ ఇంపార్టెంట్ రోల్ లో రానా నటించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ ఈ సినిమాకే హైలెట్ గా నిలవబోతుందంట.

పైగా రానా కూడా గెటప్ తో సహా పూర్తిగా కొత్త లుక్ లో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా రానా  రాజమౌళి నిర్వహించే వర్క్ షాప్స్ కు అటెండ్ అవుతున్నాడట. మరి దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ. ఒకవేళ ఉంటే కనుక.. రాజమౌళి ఎదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. 2025 జనవరి లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని.. రీసెంట్ గా ఓ అప్డేట్ కూడా వచ్చింది. త్వరలో సినిమాకు సంబంధించిన మిగిలిన అప్డేట్స్ కూడా ఇస్తారేమో చూడాలి. సినిమా స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై అందరికి ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక స్టార్ట్ అయిన తర్వాత వచ్చే అప్డేట్స్ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి SSMB 29 లో రానా నటిస్తున్నాడంటూ వినిపిస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş