iDreamPost
android-app
ios-app

రానా, తేజ కాంబో.. ఈ సారి ‘రాక్షస రాజ’గా..

  • Published Dec 14, 2023 | 12:22 PM Updated Updated Dec 14, 2023 | 12:22 PM

రానా దగ్గుబాటి, తేజ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘రాక్షస రాజ’ అనే కొత్త మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ..

రానా దగ్గుబాటి, తేజ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ‘రాక్షస రాజ’ అనే కొత్త మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ..

  • Published Dec 14, 2023 | 12:22 PMUpdated Dec 14, 2023 | 12:22 PM
రానా, తేజ కాంబో.. ఈ సారి ‘రాక్షస రాజ’గా..

స్టార్‌ కిడ్‌గా ఇండస్ట్రీకి అడుగుపెట్టినా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా దగ్గుబాటి. మొదటి చిత్రం ‘ లీడర్‌’తోటే తానేంటో నిరూపించుకున్నారు. రెండో సినిమాతోటే హిందీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. రీజనల్‌ స్టార్‌ స్థాయినుంచి ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. బాహుబలితో ఇంటర్‌నేషనల్‌ స్టార్‌డమ్‌ తెచ్చుకున్నారు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు.

2022లో విరాటపర్వం మూవీలో హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. స్పై అనే సినిమాలో గెస్ట్‌ రోల్‌ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన తమిళంలో ‘వెట్టయాన్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ రోజు రానా దగ్గుబాటి పుట్టినరోజు. రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ వచ్చింది. రానా ప్రముఖ తెలుగు దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఈ ఉదయం ఓ అప్‌డేట్‌ వచ్చింది. వీరిద్దరి కాంబోలో  ‘ రాక్షజ రాజ’ మూవీ తెరకెక్కబోతోంది. రానా గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారట. ఎమోషనల్‌ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందట. రానా, తేజ కాంబినేషన్‌లో ఇది వరకే ఓ మూవీ వచ్చింది. 2017లో ఇద్దరూ కలసి ‘ నేనే రాజు.. నేనే మంత్రి’ మూవీకి పని చేశారు. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

తేజ తాజాగా ‘అహింస’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్‌ దగ్గుబాటి వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు జూన్‌ 2వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక, రానా, తేజ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావటంతో ‘ రాక్షస రాజ’ పై భారీ అంచనాలు మొదలయ్యాయి. కాగా,  దర్శకుడు తేజ 2000లలో స్టార్‌ దర్శకుడిగా ఓ వెలుగు వెలిగారు.

తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి.. సూపర్‌ హిట్లు కొట్టారు. అది కూడా కొత్త వ్యక్తులను హీరోగా పరిచయం చేశారు. ఆయన తీసిన పలు సినిమాలు ఇతర భాషల్లో కూడా రీమేక్‌ అయ్యాయి. అక్కడ కూడా ఘన విజయాన్ని సాధించాయి. అయితే, గత కొంత కాలంగా తేజకు సరైన హిట్లు లేవు. మరి, రానా దగ్గుబాటి, తేజ కాంబినేషన్‌లో ‘రాక్షస రాజ’ సినిమా తెరకెక్కటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss