ఈ ఫోటోలో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దర్శకుడున్నాడు.. ఎవరో గుర్తు పట్టండి

ఈ ఫోటోలో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఇద్దరు స్టార్స్ ఉన్నారు. ఒకరు ఆల్రెడీ ఫ్రూవ్డ్ హీరో. మరొకరు టాలీవుడ్ మూవీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు. ఇంతకు ఆ దర్శకుడు ఎక్కడ ఉన్నాడో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఇద్దరు స్టార్స్ ఉన్నారు. ఒకరు ఆల్రెడీ ఫ్రూవ్డ్ హీరో. మరొకరు టాలీవుడ్ మూవీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకుడు. ఇంతకు ఆ దర్శకుడు ఎక్కడ ఉన్నాడో చెప్పుకోండి చూద్దాం.

24 క్రాఫ్ట్‌ల మేలికలయికే ఓ సినిమా. అయితే ఫిల్మ్ మేకర్ లేదా మేకింగ్ చేయాలన్న ఆసక్తి ఉన్న వ్యక్తికి ఈ 24 క్రాఫ్ట్స్ గురించి స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆన్ స్క్రీన్‌పై హీరో హవా కొనసాగిస్తే.. బిహైండ్ ది స్క్రీన్ హీరో దర్శకుడే. ఓ సినిమాకు సంబంధించిన 24 శాఖలను ఒక్కతాటిపైకి తెచ్చి.. తనకు కావాల్సిన విధంగా వర్క్ చేయించుకోవాలి దర్శకుడు. ఇది కత్తిమీద సాములాటిందే. కథకు ప్రాణం పోసి ప్రేక్షకులకు అందిస్తాడు. సినిమా కోసం ఎంతో శ్రమిస్తాడు. షూటింగ్‌కు ముందు ప్రీ ప్రొడక్షన్ నుండి చిత్రీకరణ ముగిశాక.. పోస్టు ప్రొడక్షన్, సినిమా రిలీజ్ వరకు తన భుజాల మీద సినిమాను మోస్తాడు. ఓ మూవీ హిట్, ఫట్ అవ్వాలన్న దర్శకుడి ప్రతిభలోనే దాగి ఉంది. పని చేసి.. ఫలితం ప్రేక్షకులకు వదిలేస్తాడు. ఇదంతా పక్కన పెడితే..ఇదిగో ఈ ఫోటోలో ఓ ఫేమస్ దర్శకుడు దాగి ఉన్నాడు గుర్తు పట్టారా..?

కేవలం మూడంటే మూడు సినిమాలు చేసి..హాలీవుడ్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి చాలా సింపుల్ అండ్ షైగా కనిపించే ఈ డైరెక్టర్.. తక్కువ సమయంలోనే టాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచేశాడు. ఈ ఫోటోలో మరో హీరో కూడా ఉన్నాడండోయ్. అతడు కూడా టాలీవుడ్ సూపర్ స్టారే. వీళ్లిద్దరూ చిన్నప్పటి క్లాస్ మేట్స్. ఇంతకు ఆ ఫోటోలో టీచర్ వెనుక రైట్ సైడ్ లో ఉన్న ఆ పిల్లగాడు.. ప్రముఖ నిర్మాతకు అల్లుడు. మహిళా నిర్మాతకు భర్త కూడా. ఇంతకు అతడు ఎవరంటే.. కల్కి 2898 ఏడీ మూవీతో సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న నాగ్ అశ్విన్ రెడ్డి. డాక్టర్ ఫ్యామిలీ నుండి వచ్చిన నాగీ.. దర్శకుడయ్యాడు. ఆయన తల్లిదండ్రులు, సోదరి సైతం డాక్టర్సే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది.  అలాగే ఈ ఫోటోలో ఫస్ట్ రోలో కూర్చున్న థర్డ్ పర్సన్ ఎవరో తెలుసా.. రానా. మూడో తరగతి వరకు.. మన బళ్లాల దేవ రానా, నాగీ క్లాస్ మేట్స్.

మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసిన నాగీ, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్స్ చేశాడు. ఆ తర్వాత నేను మీకు తెలుసా? లీడర్? లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయడమే కాదు స్మాల్ రోల్స్‌లో యాక్ట్ చేశాడు. శేఖర్ కమ్ముల నుండి సింప్లిసిటీని వారసత్వంగా తీసుకున్న నాగ్ అశ్విన్.. తాను కూడా అదే ఫాలో అవుతుంటాడు. 2015లో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూతురు ప్రియాంక దత్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికో కొడుకు. అదే ఏడాది ఎవడే సుబ్రమణ్యం మూవీ చేసి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. వెంటనే రిస్క్ అని తెలిసినా కూడా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత లాక్ డౌన్. ఆ సమయంలో పిట్టకథలు అనే ఓ వెబ్ సిరీస్‌లో ఓ సెగ్మెంట్‌కు పనిచేశాడు. ఇప్పుడు కల్కి సినిమాతో ముందుకు వచ్చాడు.

Show comments