iDreamPost
android-app
ios-app

టీవి రామాయణం మళ్ళీ ప్రసారం.. పూనకాలే పూనకాలు

దూరదర్శన్లో టెలికాస్ట్ అయిన హిందీ సీరియల్ రామయాణం మళ్ళీ టెలికాస్ట్ కు సిద్దమవుతోందంటే... అదో పెద్ద సంచలనంగా మారింది ప్రస్తుతం దేశంలో. రోజురోజుకి పెరిగిపోతున్న రామభక్తిని దూరదర్శన్ కేష్ చేసుకోవాలనుకోవడంలో అతిశయోక్తి లేదు.

దూరదర్శన్లో టెలికాస్ట్ అయిన హిందీ సీరియల్ రామయాణం మళ్ళీ టెలికాస్ట్ కు సిద్దమవుతోందంటే... అదో పెద్ద సంచలనంగా మారింది ప్రస్తుతం దేశంలో. రోజురోజుకి పెరిగిపోతున్న రామభక్తిని దూరదర్శన్ కేష్ చేసుకోవాలనుకోవడంలో అతిశయోక్తి లేదు.

టీవి రామాయణం మళ్ళీ ప్రసారం.. పూనకాలే పూనకాలు

దేశమంతా రామనామజపంతో దద్దరిల్లిపోతోంది. మొన్నీమధ్యనే రామ విగ్రహ ప్రతిష్ట, రామమందిర సకల సందర్శనం వంటి పవిత్రమైన సందర్భాలు దేశప్రజలలోనే కాదు, ఇతర దేశాలలో కూడా భారతదేశం, హిందూమత రక్తిపట్ల విపరీతమైన వ్యామోహం, ఒక ప్రత్యేకమైన మూడ్ నెలకొన్నాయి. దానికి తోడు, తెలుగులో తీసి, పాన్ ఇండియాలో రిలీజైన ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి దర్శకనిర్మాతలుగా రూపొందిన హనుమాన్ సినిమా దాదాపు 300 కోట్లు టచ్ అయి అదో సంచలనాన్ని రేపి, హనుమంతుడి మహిమకు అద్దం పట్టినట్టుగా దుమ్ము లేపేస్తోంది. మరో వైపున హిందీలో రణ్బీర్ కపూర్, సన్నీడియోల్, సాయి పల్లవి కాంబినేషన్లో ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్న రామాయణ త్రిపార్ట్ ఫ్రాంచైజ్ ఒకటి అందరి అటెన్షన్ ని ఆకట్టుకుంది.

ఇటువంటి పరిస్థితులలో అలనాడు అంటే 1987, 88 సంవత్సరాలలో దూరదర్శన్లో టెలికాస్ట్ అయిన హిందీ సీరియల్ రామయాణం మళ్ళీ టెలికాస్ట్ కు సిద్దమవుతోందంటే… అదో పెద్ద సంచలనంగా మారింది ప్రస్తుతం దేశంలో. రోజురోజుకి పెరిగిపోతున్న రామభక్తిని దూరదర్శన్ కేష్ చేసుకోవాలనుకోవడంలో అతిశయోక్తి లేదు. విచిత్రమూ కాదు. వాల్మీకి రామాయణం అని ప్రసిద్ధి పొందిన రామాయణ మహాకావ్యం, టీవి రామాయణం అని పేరు సాధించింది. రామానంద్ సాగర్ టీవి రామాయణాన్ని రాసి, డైరెక్ట్ చేసి ఇంటింటినీ భక్తి మైకంలో ముంచెత్తాడు. అదే అటువంటి భక్తిరస సీరియల్ మొదటిది కావడంతో దేశమంతా ఇంటిల్లిపాది టీవీ సెట్లకు అతుక్కుపోయారు.

Ramayana telecast again

సీరియల్ ఎపిసోడ్స్ ప్రసారమవుతున్నాయనగానే ఆఫీసులకి, ఇతరత్రా కార్యక్రమాలకి అన్నిటినీ పక్కన పెట్టి మరీ టోటల్ గా రామాయణం పిచ్చిలో పడిపోయారు. చాలా చోట్ల నార్త్ అయితే, టీవీ సెట్లకి హారతులిచ్చి, నైవేద్యాలు పెట్టి, పసుపు కుంకుమ కూడా రాసి మరీ సీరియల్ని వీక్షించారు. ఇది సరదాగానో, అతిశయోక్తిగానో రాస్తున్నది కాదు. నిజంగా జరిగిన సంఘటన. దాదాపు 82 పర్సంట్ వ్యూయర్ షిప్ తో టీవీ రామాయణం దేశాన్ని అల్లల్లాడించింది.

హిందీవాళ్ళకి ఈ పౌరాణిక వేషాలు, ఆ గెటప్స్ ఏ మాత్రం సూటు కాక, వాళ్ళెప్పుడూ వాటి జోలికే పోలేదు. ఎప్పుడో అరా ఒకటి పాతరోజుల్లో వచ్చినా కూడా అవి ఏ మాత్రం సక్సెస్ కాలేదు. అందుకే బాలీవుడ్ కూడా పౌరాణికాలను తీయాలనే సాహసానికి ఒడిగట్టలేదు. రామానంద సాగర్ కూడా సీరియల్ షూటింగ్ కి పూనుకునే ముందు హైదరాబాద్ వచ్చి, పౌరాణికాలకు చిరునామాగా భారతదేశమంతా గుర్తింపు పొందిన మన నందమూరి తారకరామారావు దగ్గరకు వచ్చి, ఏ పాత్ర ఎలా ఉండాలి, ఏ గెటప్ ఎలా ఉండాలి అని సంప్రదించి, తన కథను, స్క్రీన్ ప్లేల గురించి చర్చించి, ఎన్టీ ఆర్ సలహాలు మేరకు టీవి రామాయణం మేకింగ్ మొదలు పెట్టారు.

పైగా ఈ టీవి రామాయణానికి అనాఠి మోస్ట్ సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ రవీంద్ర జైన్ సంగీతాన్ని సమకూర్చఢం పెద్ద ప్లస్ పాయంట్ అయింది. అంతవరకూ అరకొర వేషాలు వేసిన అరుణ్ గోవిల్ రాముడు వేషంతో నిజంగానే రాముడై పోయాడు. దీపికా చికుల్వాలియా సీత పాత్రతో గొప్ప నీరాజనాలనందుకుంది. రావణాసురుడి వేషం పెద్దగా రక్తి కట్టకపోయినా కూడా టోటల్ గా సీరియల్ మాత్రం బంపర్ హిట్ అయింది. ఇఫ్పుడదే సీరియల్ పునః ప్రసారమవుతుందంటే పూనకాలు ఒక్కటే తక్కువ. నిన్ననే డిడి ప్రకటించింది ఈ నెలనుంచే ప్రసారం ప్రారంభమని. రామభక్తులకి పండగే పండగ ఇంక.

                                                                                                              -నాగేంద్ర కుమార్