సినీ పరిశ్రమలో కొత్త వాళ్లు ఎంట్రీ ఇవ్వాలంటే చాలా కష్టం. తమ టాలెంట్‌ను నిరూపించుకునే అవకాశం వచ్చే దాకా వాళ్ల ఎదురు చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి ఛాన్స్ వస్తే దాన్ని పక్కాగా సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే మళ్లీ అవకాశాలు రావడం కష్టమనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి కొత్తవారికి ఛాన్సులు రావడం కష్టం కావొచ్చు గానీ.. అప్పటికే నిలదొక్కుకున్న వారి ద్వారా అవకాశం రావడం సులువనే చెప్పాలి. స్టార్ నటీనటులు, టెక్నీషియన్స్ ఫ్యామిలీకి చెందిన వారు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.
వారసుల పిల్లలు అరంగేట్రం చేస్తున్నారంటే వారిపై భారీ అంచనాలు ఉంటాయి. ఒకవేళ ఆ అంచనాలను రీచ్ అయితే మాత్రం ఇక వారికి తిరుగుండదు. అలా వారసత్వం ద్వారా పరిశ్రమలోకి వచ్చి సెటిలైన స్టార్లు కొందరే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సినీ పరిశ్రమలోకి ఒక స్టార్ డైరెక్టర్ సోదరి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట. ఆమె మరెవరో కాదు.. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోదరి విజయలక్ష్మీ కావడం గమనార్హం. ఆర్జీవీ గురించి అవకాశం దొరికినప్పుడుల్లా ఆమె మాట్లాడుతుంటారు. ఆర్జీవీ సోదరి విజయలక్ష్మీ త్వరలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
సినిమాలు అంటే తనకు ఇష్టమని చెప్పిన విజయలక్ష్మీ.. తాను ప్రొడ్యూస్ చేస్తానంటే ఆర్జీవీ వద్దన్నారని చెప్పారు. తనకు దర్శకత్వం గురించి పెద్దగా తెలియదని.. అయితే సినిమాలను నిర్మించాలని మాత్రం ఉందన్నారామె. అయితే నిర్మాతగా మారే దారిలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్జీవీ తిరస్కరించారని విజయలక్ష్మీ తెలిపారు. తనను ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలని అనుకుంటాడని పేర్కొన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి ఇబ్బంది పడతావేమోనని ఆర్జీవీ అంటుంటారని వివరించారు. అయితే మూవీ ప్రొడక్షన్‌పై విజయలక్ష్మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే.. త్వరలో ఆమె నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడం పక్కా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.
ఇదీ చదవండి: సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ చనిపోతున్న ‘జైలర్’ విలన్లు!