iDreamPost

సినిమాలోనే కాదూ.. నిజ జీవితంలోనూ చనిపోతున్న జైలర్ మూవీ విలన్లు

సినిమాలోనే కాదూ.. నిజ జీవితంలోనూ చనిపోతున్న జైలర్ మూవీ విలన్లు

ఒక సినిమా ఖరారు అయ్యాక, సెట్స్ మీదకు వెళ్లే ముందు మంచి ముహుర్తం చూసుకునే స్టార్ట్ చేస్తారు. అయితే షూటింగ్ సమయాల్లో విపత్తులు జరగడం కానీ, ఆ సినిమాల్లోని నటీనటులకు ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే.. అపశకునంగా విశ్వసిస్తుంటారు. గతంలో చంద్రముఖి సినిమా సమయంలో ఇలాగే పుకార్లు షికార్లు చేశాయి. కారణం ఈ సినిమా కన్నా ముందే కన్నడలో ఆప్తమిత్రలో నటించిన సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోయింది. ఆ తర్వాత ఆ సినిమా హీరో, శాండిల్‌వుడ్ స్టార్ నటుడు విష్ణువర్థన్ మరణించడంతో ఏదో శాపం వెంటాడుతూ ఉందని విశ్వసించారు. ఆ తర్వాత రజనీకాంత్ ఈ సినిమా చేయడంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో ఆయన సతమతమౌతుంటే.. ఆ సెంటిమెంట్‌ను బలంగా నమ్మారు కొందరు. అయితే వాటిని పటాపంచలు చేస్తూ.. ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న కమల్ హాసన్ ఇండియన్-2 కూడా ఇలాంటి అపవాదులు మూటగట్టుకుంది.

తాజాగా ఇప్పుడు మరోసారి రజనీకాంత్ సినిమా ఇదే రకమైన సెంటిమెంట్ తో వార్తల్లో నిలుస్తుంది. దాని కారణం ఈ సినిమాలోని నటులు వరుసగా మృత్యు ఒడికి చేరుకోవడమే. అదే జైలర్ మూవీ. వరుస ప్లాపుల నుండి రజనీకాంత్‌ను గట్టెక్కించిన సినిమా ఇది. సుమారు రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది జైలర్ మూవీ. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలిప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోట్ల వర్షం కురిపించడంతో పండగ చేసుకుందీ చిత్ర యూనిట్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకున్నందుకు నిర్మాత.. హీరో రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, డైరెక్టర్ నెల్సన్‌కు కార్లు గిఫ్టుగా ఇచ్చిన సంగతి విదితమే. అయితే అదే సమయంలో ఈ సినిమాను సెంటిమెంట్స్ వెంటాడుతున్నాయి. దానికి కారణం ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు హఠాత్తుగా మరణిస్తున్నారు.

జైలర్ మూవీలో ప్రతి క్యారెక్టర్ పండింది. విలనిజంలో కూడా కొత్త దనం పండించాడు దర్శకుడు నెల్సన్. ఇందులో విలన్‌కు ఓ గ్యాంగ్ ఉంటుంది. గ్యాంగ్ పండించిన హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే ఈ గ్యాంగ్‌లో ఉన్న నటులు సినిమాల్లోనే కాదూ నిజ జీవితంలోనూ మృత్యువాత పడుతున్నారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటించిన వినాయకన్‍కు విధేయుడిగా మెప్పించాడు మరిముత్తు. 56 ఏళ్ల వయస్సులో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. దాదాపు 25 ఏళ్ల నుండి సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు మరిముత్తు. కోలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. జైలర్ సినిమాతో గుర్తింపు వచ్చిన సమయంలో ఇలా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అలాగే కొన్ని నెలల క్రితం డ్యాన్సర్ రమేష్ సైతం చనిపోయిన సంగతి విదితమే. ఈ సినిమాలో విలన్ గ్రూపులో ఉంటాడు రమేష్. డ్యాన్సర్ అయిన రమేష్ .. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. అయితే ఇతడు సినిమా విడుదలకు ముందే మరణించాడు. జైలర్ సక్సెస్ చూడకుండానే కన్నుమూశాడు. వరుసగా విలన్ గ్యాంగ్ లోని వ్యక్తులు చనిపోవడం యాదృచ్చికమా లేదా ఏదైనా సెంటిమెంట్ వెంటాడుతందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి