iDreamPost
android-app
ios-app

Ram Gopal Varma: డబ్బు తీసుకునే సెలబ్రిటీలు పెళ్లిళ్ళకు వస్తారు.. బాంబ్ పేల్చిన RGV! సన్నీ లియోన్ కు ఎంతిస్తారంటే?

  • Published Aug 17, 2024 | 4:48 PM Updated Updated Aug 17, 2024 | 5:37 PM

సెలబ్రిటీలు పెళ్లిళ్ళకు, ఫంక్షన్స్ కు హాజరుకావడంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. డబ్బు తీసుకునే సెలబ్రిటీలు పెళ్లిళ్ళలకు, ఫంక్షన్లకు వస్తారని బాంబ్ పేల్చాడు ఈ వివాదాస్పద డైరెక్టర్. ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

సెలబ్రిటీలు పెళ్లిళ్ళకు, ఫంక్షన్స్ కు హాజరుకావడంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. డబ్బు తీసుకునే సెలబ్రిటీలు పెళ్లిళ్ళలకు, ఫంక్షన్లకు వస్తారని బాంబ్ పేల్చాడు ఈ వివాదాస్పద డైరెక్టర్. ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

  • Published Aug 17, 2024 | 4:48 PMUpdated Aug 17, 2024 | 5:37 PM
Ram Gopal Varma: డబ్బు తీసుకునే సెలబ్రిటీలు పెళ్లిళ్ళకు వస్తారు.. బాంబ్ పేల్చిన RGV! సన్నీ లియోన్ కు ఎంతిస్తారంటే?

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు చెప్పగానే అందరికీ కాంట్రవర్సీ అనే పదమే గుర్తుకువస్తుంది. అంతలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. అంశం ఏదైనా తనదైన శైలిలో విశ్లేషణ చేస్తుంటాడు ఆర్జీవీ. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులపై కూడా విమర్శలు చేసిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ సెలబ్రిటీలు పెళ్లిళ్ళకు, ఫంక్షన్స్ కు హాజరుకావడంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. డబ్బు తీసుకునే సెలబ్రిటీలు పెళ్లిళ్ళలకు, ఫంక్షన్లకు వస్తారని బాంబ్ పేల్చాడు. అలాగే సన్నీ లియోన్ ఫంక్షన్స్ కు వస్తే.. ఎంత మనీ తీసుకుంటుందో కూడా చెప్పాడు.

సెలబ్రిటీలు పెళ్లిళ్ళకు, ఫంక్షన్లకు డబ్బు తీసుకుని వస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా మందికి ఉండి ఉంటుంది. ఇక అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలను చూసిన తర్వాత ఈ చర్చ ఎక్కువైంది. తాజాగా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెలబ్రిటీలు మ్యారేజ్ లకు, ఫంక్షన్లకు డబ్బులు తీసుకునే వస్తారని, అది వారి బిజినెస్ అని ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..”చాలా మంది సెలబ్రిటీలను మ్యారేజ్ లకు, బర్త్ డే పార్టీలకు, రకరకాల ఫంక్షన్స్ కు ఎందుకు పిలుస్తారు? తమ పెళ్లికి, ఫంక్షన్స్ కి పలానా స్టార్ సెలబ్రిటీలు వచ్చారు అని గొప్పలు చెప్పుకోవడానికే. వారి స్టార్ డమ్ ను వీళ్లు వాడుకుంటున్నారు. అందుకే సెలబ్రిటీలు కూడా దాన్ని బిజినెస్ చేసుకుని ఫంక్షన్స్ కు డబ్బులు తీసుకునే వెళ్తుంటారు. ఇక అనంత్ అంబానీ పెళ్లికి జస్టిన్ బీబర్, రిహన్నా లాంటి హాలీవుడ్ స్టార్లు వచ్చారు. వారికి కోట్లలో డబ్బు ఇచ్చారనే వార్తలు వచ్చాయి, ఆ న్యూస్ నిజమే. ఇక సన్నీలియోన్ ఒక్క బర్త్ డే పార్టీకి వస్తేనే రూ. 25 లక్షలు తీసుకుంటుంది” అని చెప్పుకొచ్చాడు ఆర్జీవీ. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మరి ఆర్జీవీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş