iDreamPost
android-app
ios-app

కడప దర్గాకు వెళ్లిన రామ్ చరణ్.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా!

  • Published Nov 19, 2024 | 3:23 PM Updated Updated Nov 19, 2024 | 3:23 PM

Ram Charan : రీసెంట్ గా రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కడప దర్గాలో అతను సందడి చేశాడు. అయ్యప్ప మాలలో ఉండి కూడా దర్గాకు వెళ్లడం ఏంటి అని కూడా నెట్టింట చర్చలు జరిగాయి. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ ఏ ఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం అక్కడికి వెళ్ళాడట.. అయితే అక్కడ చరణ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయటపెట్టాడు.

Ram Charan : రీసెంట్ గా రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కడప దర్గాలో అతను సందడి చేశాడు. అయ్యప్ప మాలలో ఉండి కూడా దర్గాకు వెళ్లడం ఏంటి అని కూడా నెట్టింట చర్చలు జరిగాయి. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ ఏ ఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం అక్కడికి వెళ్ళాడట.. అయితే అక్కడ చరణ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయటపెట్టాడు.

  • Published Nov 19, 2024 | 3:23 PMUpdated Nov 19, 2024 | 3:23 PM
కడప దర్గాకు వెళ్లిన రామ్ చరణ్.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా!

రీసెంట్ గా రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కడప దర్గాలో అతను సందడి చేశాడు. అయ్యప్ప మాలలో ఉండి కూడా దర్గాకు వెళ్లడం ఏంటి అని కూడా నెట్టింట చర్చలు జరిగాయి. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ ఏ ఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట కోసం అక్కడికి వెళ్ళాడట. మూడు నెలల క్రితమే రెహమాన్ ఈ కార్యక్రమం గురించి చరణ్ కు చెప్పాడట. ఎలాగైనా సరే ఈ ఈవెంట్ కు వచ్చి తీరాల్సిందే అని అన్నారట రెహమాన్. దీనితో చరణ్ కూడా రెహమాన్ కు మాట ఇచ్చాడట. అందుకే అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్ ఆ దర్గాకు వెళ్ళాడట. అయితే అక్కడ చరణ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయటపెట్టాడు. కడప దర్గాతో తనకెంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు.అలాగే ఈ దర్గాతో ఋణం తీర్చుకోలేనిదని తెలిపాడు. ఎందుకంటే తన కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ మగధీర రిలీజ్ కు ఒక రోజు ముందు.. చరణ్ అక్కడకు వచ్చాడట. ఆ సినిమా ఏ రేంజ్ లో పేలిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు మరోసారి చరణ్ అదే దర్గాకు వెళ్ళాడు.

చరణ్ వెళ్లిన రీజన్ ఏదైనా కానీ.. మరి కొద్దీ రోజుల్లో గేమ్ ఛేంజర్ సినిమా కూడా రిలీజ్ కు రెడీ గా ఉంది. దీనితో ఇప్పుడు అభిమానులు ఈ రెండిటికి లింక్ చేస్తున్నారు. మగధీర సినిమాలానే అదే సెంటిమెంట్ ఇప్పుడు వర్క్ అవుట్ అవుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే. నిజంగానే రామ్ చరణ్ కు ఆ దర్గా దర్శనం లక్కీ అని చెప్పి తీరాల్సిందే. సాధారణంగా చాలా మంది స్టార్ హీరోలకు కొన్ని టెంపుల్స్ కలిసివస్తూ ఉంటాయి. ఒకవేళ చరణ్ కు కూడా ఇది అలానే మారబోతుందా లేదా అనేది గేమ్ ఛేంజర్ డిసైడ్ చేయాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఇది పక్కా హిట్ అని భావిస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు దర్గా సెంటిమెంట్ యాడ్ అవ్వడంతో ఇంకాస్త దైర్యంగా ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ తో టోటల్ గేమ్ ఛేంజ్ అయింది. సినిమా మీద ఉండే నెగిటివిటి అంతా తుడిచిపెట్టుకుపోయింది. దీనితో సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. జనవరి 10న సినిమా రిలీజ్ కాబట్టి ఇంకా వీరి చేతిలో చాలా సమయం ఉంది. దానికి తగినట్టే ప్రమోషనల్ ప్లాన్స్ ను కూడా రెడీ చేస్తున్నారు మేకర్స్.

ఇక ఆ తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబుతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయితే అంతా పుష్ప మ్యానియా కొనసాగుతుంది. ఒక్కసారి ఈ సినిమా రిలీజ్ అయ్యి.. అనుకున్న లెక్కలు అనుకున్నట్లుగా వచ్చేస్తే.. అప్పుడు సీన్ లోకి చరణ్ ఎంట్రీ ఇస్తాడు. అప్పటినుంచి గేమ్ ఛేంజర్ పై బజ్ బాగా నడుస్తుందని చెప్పి తీరాల్సిందే. ప్రమోషన్స్ విషయంలో అయితే నార్త్ లో పోటా పోటీగా ఈ రెండు సినిమాలు పెద్ద స్కెచ్ వేస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి లభించే ఆదరణ కూడా అలాగే ఉంది. ఇక రిజల్ట్ ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet