iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ లైన్ అప్.. ఆ స్టార్ దర్శకులతో సినిమాలు లాక్

  • Published Oct 15, 2024 | 12:32 PM Updated Updated Oct 15, 2024 | 12:32 PM

Ram Charan Upcoming Films: ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్.. ఇప్పుడు తర్వాత సినిమాలకు కొత్త స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం తీస్తున్న సినిమా రిలీజ్ కాకముందే వరుస ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

Ram Charan Upcoming Films: ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్.. ఇప్పుడు తర్వాత సినిమాలకు కొత్త స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం తీస్తున్న సినిమా రిలీజ్ కాకముందే వరుస ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

  • Published Oct 15, 2024 | 12:32 PMUpdated Oct 15, 2024 | 12:32 PM
రామ్ చరణ్  లైన్ అప్..  ఆ స్టార్ దర్శకులతో సినిమాలు లాక్

ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక్కసారిగా రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. మరి ఆ సినిమాలో రామ్ చరణ్ మేక్ ఓవర్ అలాంటిది. ఆర్ఆర్ఆర్ కు ముందు చరణ్ వేరు.. ఆ తర్వాత చరణ్ వేరు అనేలా ఆ రేంజ్ లో స్టాండర్డ్స్ ను మైంటైన్ చేస్తున్నారు. ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ ను అందుకున్నారు. దీనితో ఇప్పుడు చరణ్ తర్వాత సినిమాల మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఆచార్య సినిమా వచ్చింది. కానీ అది చరణ్ సెట్ చేసిన స్టాండర్డ్స్ ను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు చరణ్.. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అదిగో ఇదిగో అంటూ ఈ సినిమా రిలీజ్ డేట్ ను సంక్రాంతి వరకు తీసుకుని వెళ్లారు. ఈసారైనా చెప్పిన టైం కు రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉండగానే.. చరణ్ స్టార్ దర్శకులతో ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

దీపం ఉండగానే ఇళ్ళు చక్కపెట్టుకోవాలి అన్నట్లు.. ఇప్పుడు బడా హీరోలంతా కూడా కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్త లేట్ అయినా పర్లేదు కానీ పక్కా హిట్ ఇచ్చే తీరుతాం అనే కాన్సెప్ట్ తో ఉంటున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చి బాబుతో ఓ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ పూర్తైన వెంటనే బుచ్చి బాబు మూవీ పట్టాలెక్కేస్తుంది. ఇక ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ కు ఒకే చెప్పాడట రామ్ చరణ్. కెజిఎఫ్ , సలార్ సినిమాలతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా.. అలాగే ఖైదీ , విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో ఓ సినిమాను తీసేందుకు రెడీ అవుతున్నాడట చరణ్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తారక్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయినా వెంటనే చరణ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే అటు లోకేష్ కనకరాజ్ కూడా రజినీకాంత్ తో కూలి సినిమాతో బిజీగా ఉన్నాడు. అది అయినా తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యాక చరణ్ తో సినిమాను తీసే అవకాశం ఉంది.

ఈ స్టార్ దర్శకులకు గ్లోబల్ స్టార్ యాడ్ అయితే ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మాత్రం అందరి ఆశలు, ఎదురుచూపులు గేమ్ ఛేంజర్ పైనే ఉన్నాయి. అటు ఇండియన్ 2 తో డిజాస్టర్ టాక్ సంపాదించుకున్న దర్శకుడి ఆశలన్నీ కూడా.. గేమ్ ఛేంజర్ పైనే ఉన్నాయి. మరి ఈ సినిమా అటు అభిమానులకు, ఇటు నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో చూడాలి. ఒకవేళ ఇది కనుక హిట్ అయితే మాత్రం చరణ్ క్రేజ్ ఇంకాస్త పెరిగిపోతుంది. ఏదేమైనా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఒక అంచనాకు రాలేము. మరి రామ్ చరణ్ లైన్ అప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler