iDreamPost
android-app
ios-app

కృష్ణాష్టమి వేడుకల్లో క్లీంకార.. ఫోటోలు వైరల్

  • Published Aug 27, 2024 | 5:13 PM Updated Updated Aug 27, 2024 | 5:13 PM

దేశ వ్యాప్తంగానే కాదు సినీ సెలబ్రిటీలు కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో కూడా పూజలు చేపట్టారు. ఈ పూజలో చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార కూడా సందడి చేసింది.

దేశ వ్యాప్తంగానే కాదు సినీ సెలబ్రిటీలు కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో కూడా పూజలు చేపట్టారు. ఈ పూజలో చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార కూడా సందడి చేసింది.

  • Published Aug 27, 2024 | 5:13 PMUpdated Aug 27, 2024 | 5:13 PM
కృష్ణాష్టమి వేడుకల్లో క్లీంకార.. ఫోటోలు వైరల్

ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణుడి దేవాలయాలు, ఇస్కాన్ టెంపుల్స్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. పెద్ద యెత్తున భక్తులు పాల్గొని.. పూజలు నిర్వహించారు. ఇక ఇళ్లల్లో కూడా తమ పిల్లలకు కృష్ణుడు, రాధ, యశోదల్లా తయారు చేసి మురిసిపోయారు పేరెంట్స్. బుడి బుడి అడుగులు వేసే బుజ్జాయిలతో పాద ముద్రలు వేయించారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా కృష్ణాష్టమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కూడా ఈ వేడుకలు నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపసానల ముద్దుల తనయ క్లీంకారతో బుడి బుడి అడుగులు వేయించి మురిసిపోయారు చెర్రీ సతీమణి ఉపాసన. .ఆమె అత్తమ్మ,  చిరంజీవి సతీమణి సురేఖ. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఉపాసన. అందులో కృష్ణాష్టమి పూజలో క్లీంకార కూర్చుని తదేకంగా భగవంతుడ్ని చూస్తున్న పిక్ కనిపిస్తుంది. మరో ఫోటోలో ఆమెతో బుడి బుడి పాదాలు వేయిస్తున్నారు ఉపాసన.. ఆమె అత్తమ్మ సురేఖ. మరో ఫోటోలో చెర్రీ కనిపిస్తాడు. కానీ ఎక్కడా పాప ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోటైన సంగతి విదితమే. ఆ పాపకు క్లీంకార అని నామకరణం చేశారు. పాపకు ఏడాది పూర్తయ్యింది. అయితే ఎక్కడా ఆ పాప ఫేస్ రివీల్ కాకుండా కవర్ చేస్తున్నారు పేరెంట్స్. గతంలో తిరుమల ఆలయం దర్శనానికి వెళ్లినప్పుడు మీడియా కవరేజ్ చేసినప్పుడు మాత్రమే క్లీంకార ఫేస్ కాస్త రివీల్ అయ్యింది.

కాగా, ఇటీవల రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కూతురు గురించి పలు విషయాలు పంచుకున్నాడు. క్లీంకారకు ఓ గుర్రపు పిల్లని బహుమతిగా ఇచ్చానని, అక్కడితో ఊరుకోకుండా గుర్రపు స్వారీ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. దీంతో మా ఇద్దరి అభిరులు ఒక్కటే అన్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే చెర్రీ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ కంప్లీట్ చేసి.. బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఎలా ఉండబోతుందే అన్న విషయం కూడా వెల్లడించాడు చెర్రీ. తన రోల్ కామెడీని పంచుతుందని, 90వ దశకంలో వచ్చిన చిరంజీవి ఫన్నీ రోల్స్ ను గుర్తు చేసేలా ఉంటుందని చెప్పాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss