iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్‌కు పండగే.. రామ్‌ చరణ్‌ సినిమాలో సాయి పల్లవి!

  • Published Nov 17, 2023 | 2:28 PM Updated Updated Nov 17, 2023 | 2:28 PM

మెగాస్టార్‌ చిరంజీవి కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చినా.. తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్‌ చరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్తం గుర్తింపు తెచ్చుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చినా.. తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్‌ చరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్తం గుర్తింపు తెచ్చుకున్నారు.

  • Published Nov 17, 2023 | 2:28 PMUpdated Nov 17, 2023 | 2:28 PM
ఫ్యాన్స్‌కు పండగే.. రామ్‌ చరణ్‌ సినిమాలో సాయి పల్లవి!

‘ఆర్ ఆర్ ఆర్ ‘ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను సెట్ చేసుకున్నాడు మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్’. తండ్రి లెగసీ ఏ మాత్రం తగ్గకుండా అదే స్థాయిలో కొనసాగిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం ఈ మెగా హీరో స్టార్ డైరెక్టర్ ‘శంకర్’ తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ రామ్ చరణ్ అభిమానులకు మరింత అంచనాలు పెంచేసింది. పొలిటికల్ డ్రామా తో రానున్న ఈ చిత్రం రాంచరణ్ కు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్లు ప్రచారం. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్ లలో సందడి చేయనుంది.

అయితే రామ్ చరణ్ ఈ చిత్రం తరువాత మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఆ చిత్ర దర్శకుడు మరెవరో కాదు ‘ఉప్పెన’ ఫేమ్ ‘బుచ్చిబాబు సనా’. ‘మైత్రీ మూవీ మేకర్స్’ భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ఆస్కార్ గ్రహీత ‘ఏ ఆర్ రహమాన్’ సంగీతం అందిస్తున్నారు. మరి త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం పైన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమా హీరోయిన్ గా నేచురల్ బ్యూటీ ‘సాయి పల్లవి’ ని ఫిక్స్ చేశారట మేకర్స్. ఇక సాయి పల్లవి గురించి అందరికి తెల్సిన విషయమే.

తెలుగు, తమిళం మరియు మలయాళ ఇండస్ట్రీ లో సాయి పల్లవి ఒక అద్భుతమైన నటి. తన నటనతో ,అందంతో ,డాన్స్ తో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 2017 లో విడుదలైన ‘ఫిదా’ మూవీ తో తెలుగు లో పరిచయం అయింది ఈ అమ్మడు. తెలుగు ఇండస్ట్రీ లో ఒక సంప్రదాయమైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఇక మెగా పవర్ స్టార్ , నేచురల్ బ్యూటీ కలిసి నటించబోతున్నారని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. మూవీ మేకర్స్ కూడా త్వరలోనే ఈ న్యూస్ అధికారంగా ప్రకటించనున్నారట. దీనితో ఈ టాపిక్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. మరి మీరు సాయి పల్లవి ,రాంచరణ్ కలిసి నటిస్తే ఎలా ఉంటుందని భావిస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom