iDreamPost
android-app
ios-app

వీడియో: రామ్ చరణ్ గిఫ్ట్.. ప్రతిరోజు ఉమెన్స్ డే కావాలంటున్న ఉపాసన!

  • Published Mar 08, 2024 | 10:12 PM Updated Updated Mar 09, 2024 | 8:32 AM

Ram Charan Gift For Womens Day: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరోగా చెర్రీ గురించి అందరికీ తెలుసు. ఇంట్లో కొడుకుగా, భర్తగా ఎలా ఉంటాడో ఈ వీడియోలో చూడండి.

Ram Charan Gift For Womens Day: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హీరోగా చెర్రీ గురించి అందరికీ తెలుసు. ఇంట్లో కొడుకుగా, భర్తగా ఎలా ఉంటాడో ఈ వీడియోలో చూడండి.

  • Published Mar 08, 2024 | 10:12 PMUpdated Mar 09, 2024 | 8:32 AM
వీడియో: రామ్ చరణ్ గిఫ్ట్.. ప్రతిరోజు ఉమెన్స్ డే కావాలంటున్న ఉపాసన!

రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్న తీరు చూసి టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో మురిసిపోతున్నారు. నటుడిగా తన ఫ్యాన్స్, తెలుగు సినిమా ప్రేక్షకులను ప్రతి సినిమాకి గర్వ పడేలా చేస్తున్నాడు. అలాగే ఒక కొడుకుగా తండ్రిని, తల్లిని ఎప్పుడూ ఆనందపెడుతూనే ఉంటాడు. ఇక భర్తగా భార్య ఉపాసనను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఒక హీరోనే కాదు.. ఒక వ్యక్తిగా కూడా రామ్ చరణ్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ గౌరవాన్ని మరింత పెంచుతూ రామ్ చరణ్.. ఉమెన్స్ డే సందర్భంగా తన తల్లి, భార్యకు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.

రామ్ చరణ్ కు ఫ్యామిలీతో ఉండే అనుబంధం, బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే భార్యపై ఉండే ప్రేమను కూడా పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా చూస్తూనే వచ్చాం. ఉపాసన షాపింగ్ చేస్తే బాధ్యత గల భర్తగా బ్యాగులు మోయడం. అలిసిపోయి నిద్రపోతుంటే కాళ్లు నొక్కడం మన అందరికీ తెలిసిందే. అలాంటి రామ్ చరణ్ తల్లి- భార్యకు ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు అని అంతా తెగ ఆలోచించి ఉంటారు. నిజానికి రామ్ చరణ్ వాళ్లు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. వాళ్ల కోసం స్వయంగా వంట చేసి పెట్టాడు. అదేంటి వంటకేనా అని తీసిపారేయద్దు.. లైట్ తీసుకోవద్దు.

ఆడవారి ముందు చిన్న పని చేసి కొండని ఎత్తినట్టు అలసిపోయే మగాళ్ల బతుకులు చిన్నవి. అందుకే వారంలో ఒకరోజు సెలవు తీసుకుంటాం. ఆడాళ్లకు మాత్రం ఆ ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వం. ఆఫీస్ పని లేదు హమ్మయ్యా అనుకుంటే ఇంటి పని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయినా గానీ వాళ్లు కసురుకోకుండా సంతోషంగా చేస్తారు. అలాంటి స్త్రీకి ఈ ఉమెన్స్ డేకి వంటగది నుంచి సెలవు ఇవ్వడం కన్నా ఇంకా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి? అదే గిఫ్ట్ ని రామ్ చరణ్ తన తల్లి- భార్యకు ఇచ్చాడు. తల్లికోసం పన్నీర్ టిక్కా చేసి పెట్టాడు. ఆ మొత్తాన్ని ఉపాసన తన ఫోన్లో బంధించింది. తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో ఉమెన్స్ డే స్పెషల్ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బెస్ట్ సన్, బెస్ట్ హస్బెండ్, బెస్ట్ హ్యూమన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆడవాళ్లకు కిచెన్ నుంచి బ్రేక్ ఇవ్వడం కన్నా.. ఉమెన్స్ డేకి బెస్ట్ గిఫ్ట్ ఏం ఉంటుంది అంటున్నారు. మొత్తానికి ఈ వీడియోతో మరోసారి రామ్ చరణ్ ఎంత ఉన్నతంగా ఉంటాడు అనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇంక సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నిర్మాత దిల్ రాజు ఒక లీక్ అయితే ఇచ్చారు. అదేంటంటే.. చెర్రీ బర్త్ డేకి గేమ్ ఛేంజర్ నుంచి అప్ డేట్ ఉంటుందని చెప్పారు. ఈ వార్త విన్న తర్వాత ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. మరి.. రామ్ చరణ్ ఇచ్చిన గిఫ్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom