iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ మూవీని ఎవరు పట్టించుకోవడం లేదా! అప్ డేట్స్ పై క్లారిటీ?

  • Published Sep 20, 2024 | 1:16 PM Updated Updated Sep 20, 2024 | 1:16 PM

Game Changer: ప్రస్తుతం ప్రేక్షకులంతా దేవర హైప్ లో మునిగితేలుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఆ మాత్రం హైప్ ఉండడంలో తప్పు లేదు. ఇటు తారక్ కు ఎలానో.. అటు చరణ్ కు కూడా గేమ్ ఛేంజర్ అలానే. అసలు గేమ్ ఛేంజర్ పరిస్థితి ఎలా ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Game Changer: ప్రస్తుతం ప్రేక్షకులంతా దేవర హైప్ లో మునిగితేలుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఆ మాత్రం హైప్ ఉండడంలో తప్పు లేదు. ఇటు తారక్ కు ఎలానో.. అటు చరణ్ కు కూడా గేమ్ ఛేంజర్ అలానే. అసలు గేమ్ ఛేంజర్ పరిస్థితి ఎలా ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 20, 2024 | 1:16 PMUpdated Sep 20, 2024 | 1:16 PM
గేమ్ ఛేంజర్ మూవీని ఎవరు పట్టించుకోవడం లేదా! అప్ డేట్స్ పై క్లారిటీ?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్, తారక్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ కు చేరుకుంది. ఒక్కసారి ఆ రేంజ్ లో తమ అభిమాన హీరోలను చూసిన తర్వాత.. కచ్చితంగా నెక్స్ట్ సినిమాలపై ఇంకాస్త అంచనాలు పెరుగుతాయి. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. రాజమౌళి మూవీ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులలో ఒకింత టెన్షన్ కూడా ఉంటుంది. అది ఎందుకో ఆల్రెడీ అందరికి తెలుసు. సో ప్రస్తుతం ప్రేక్షకులంతా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులే ఉన్న దేవర హైప్ లో మునిగితేలుతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇటు తారక్ కు ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర ఎలానో.. అటు చరణ్ కు కూడా గేమ్ ఛేంజర్ మూవీ అలానే. కానీ ఇప్పుడు ఈ మూవీ పరిస్థితి చూస్తే మాత్రం. ముందు అనుకున్నంత రేంజ్ లో హైప్ లేనట్లుగా అనిపిస్తుంది. అసలు గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ ఎలా ఉన్నాయో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ. నిజానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళి మూడేళ్లు అయింది. ఏడాది తిరగకుండా థియేటర్ లో అడుగుపెట్టాల్సిన ఈ మూవీ.. ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. దీనితో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటివరకు టైటిల్ గ్లిమ్ప్స్ , ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. అవి కూడా అంతంత మాత్రంగానే అనిపించుకున్నాయి. కనీసం రిలీజ్ డేట్ ను అయినా ప్రకటిస్తారనుకుంటే.. దిల్ రాజు క్రిస్టమస్ కు వస్తుందని హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అటు శంకర్ కూడా సినిమా రిలీజ్ గురించి ఏమి మాట్లాడడం లేదు. దీనితో తమన్ ఆ భాధ్యతను చేపట్టి.. రీసెంట్ గా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. మరి మిగిలిన అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయి. అసలు అనుకున్న టైమ్ కు రిలీజ్ చేస్తారా ఇలా అనేక సందేహాలు కూడా మొదలయ్యాయి. తమన్ అయితే తన క్లారిటీ ఇచ్చేశాడు. కానీ చూడబోతుంటే ఈ మూవీని ఎవరు పట్టించుకోవట్లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక మూవీ రిలీజ్ డేట్ అనౌన్సుమెంట్ తో మెగా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరి కొన్ని సినిమాల ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆల్రెడీ నితిన్ రాబిన్ హుడ్ మూవీని డిసెంబర్ 20 నే ప్రకటించారు మేకర్స్. ఇక నాగ చైతన్య తండేల్ సినిమాను కూడా క్రిస్టమస్ కు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ డేట్ ను కూడా అప్పుడే అనౌన్స్ చేయడంతో.. ఈ రెండు సినిమాల డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్. మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు రానున్నాయి అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ లేదు. ఇక ఫ్యాన్స్ మాత్రం గేమ్ ఛేంజర్ మూవీ నుంచి అప్ డేట్స్ ఈసారి పక్కాగా చెప్పిన సమయానికే.. వస్తాయనే భావిస్తున్నారు. ఏమౌతుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio