iDreamPost
android-app
ios-app

RC16 Movie Title: చరణ్ కోసం తారక్ టైటిల్.. వీరి స్నేహానికి హ్యాట్సాఫ్!

  • Published Mar 15, 2024 | 12:18 PM Updated Updated Mar 15, 2024 | 12:18 PM

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన మూవీకి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కోసం రిజిస్టర్ చేసిన పేరును రామ్ చరణ్ మూవీకి తీసుకున్నాడు డైరెక్టర్. మరి RC16 టైటిల్ ఏంటంటే?

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన మూవీకి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కోసం రిజిస్టర్ చేసిన పేరును రామ్ చరణ్ మూవీకి తీసుకున్నాడు డైరెక్టర్. మరి RC16 టైటిల్ ఏంటంటే?

  • Published Mar 15, 2024 | 12:18 PMUpdated Mar 15, 2024 | 12:18 PM
RC16 Movie Title: చరణ్ కోసం తారక్ టైటిల్.. వీరి స్నేహానికి హ్యాట్సాఫ్!

రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. చరణ్ నటించబోయే RC16పై షూటింగ్ ప్రారంభాని కంటే ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తన రెండో మూవీకే రామ్ చరణ్ లాంటి బిగ్ స్టార్ తో పనిచేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ మూవీకి సంబంధించి వచ్చే అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తున్నాయి. తాజాగా షూటింగ్ డేట్ ఎప్పుడో తెలియగా.. ఇప్పుడు టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కోసం రిజస్టర్ చేసి టైటిల్ ను రామ్ చరణ్ కోసం ఫిక్స్ చేశారట. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో చూద్దాం పదండి మరి.

ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపుగా పూర్తికావొచ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు రామ్ చరణ్. పూర్తిగా స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీకి చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? 2022లో ఎన్టీఆర్-బుచ్చిబాబు కాంబోలో రావాల్సిన సినిమాకు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే టైటిల్ ను రామ్ చరణ్ చిత్రానికి తీసుకున్నారు. మార్చి 27న చరణ్ పుట్టినరోజు కావడంతో.. అదే రోజున షూటింగ్ ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతూ వస్తోంది. దీంతో పాటుగా మార్చి 20న పూజ కార్యక్రమాలు నిర్వహించి.. రెగ్యూలర్ షూటింగ్ కు వెళ్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా చరణ్-తారక్ మధ్య మంచి స్నేహం ఉంది. అదికాస్త ఆర్ఆర్ఆర్ మూవీలో బలపడింది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహాంతోనే తారక్ టైటిల్ ను చరణ్ తీసుకున్నాడని అభిమానులు వారి ఫ్రెండ్షిప్ కు సెల్యూట్ చేస్తున్నారు.  మరి రామ్ చరణ్ 16వ సినిమాకు ‘పెద్ది’ టైటిల్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ల్కి పార్ట్ 1 మే 9న కన్ఫర్మ్….పార్ట్ 2 2025 సంక్రాంతికి

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss