iDreamPost
android-app
ios-app

మరో బాలీవుడ్ మూవీకి రామ్ చరణ్ సైన్.. డైరెక్టర్ ఎవరంటే?

Ram Charan Bollywood Movie: రామ్ చరణ్ వరుస ప్రాజెక్టులతో జోరు మీదున్నాడు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Ram Charan Bollywood Movie: రామ్ చరణ్ వరుస ప్రాజెక్టులతో జోరు మీదున్నాడు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరో బాలీవుడ్ మూవీకి రామ్ చరణ్ సైన్.. డైరెక్టర్ ఎవరంటే?

రామ్ చరణ్.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వారసుడిగా సినీ ఎంట్రీ  ఇచ్చినా.. ఇండస్ట్రీ గర్వించే అంత ఎత్తుకి తక్కువ కాలంలోనే ఎదిగిపోయాడు. ఆర్.ఆర్.ఆర్ ముందు వరకు రీజనల్ హీరోగానే మెరుపులు మెరిపించినా.., జక్కన్న మూవీ తరువాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం చరణ్ లైనప్ చూస్తుంటే మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడో గేమ్ ఛేంజర్ స్టార్ట్ చేశాడు చెర్రీ. ఆ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నా.. బజ్ మాత్రం తగ్గడం లేదు. నెక్స్ట్ సుక్కు శిష్యుడు బుచ్చిబాబు అద్భుతమైన కథతో రెడీగా ఉన్నాడు. గౌతమ్ తిన్నూరి ప్రాజెక్ట్ పూర్తిగా పోయినట్టు కాదు. ఇంకా.. కొంతమంది స్టార్ డైరెక్టర్స్ చరణ్ డేట్స్ కోసం క్యూలో ఉన్నారు. ఇలాంటి సమయంలో చరణ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ హీరోలు సత్తా చూశాక.. బీ-టౌన్ మేకర్స్ అంతా మనోళ్ల వెంటే పడుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్ తో సినిమా చేయాలని అక్కడి స్టార్ డైరెక్టర్స్ ఎప్పుడో కసరత్తు స్టార్ట్ చేశారు. సంజయ్ లీలా భన్సాలీ నుండి.. రాజ్ కుమార్ హిరాణీ వరకు, మణిరత్నం నుండి రోహిత్ శెట్టి వరకు ఇలా చాలానే పేర్లు వినిపించాయి. అయితే.. ఇప్పుడు వీరిలో ఎవరి కాంబినేషన్ సెట్ అయ్యిందో తెలియదు గాని.., మూడు రోజుల క్రితం చరణ్ ఓ బాలీవుడ్ మూవీకి సైన్ చేసినట్టు పక్కా న్యూస్ అందుతోంది. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మూవీ లోకల్ లాంగ్వేజ్  బేస్ గా చేసుకుని తెరకెక్కుతున్నాయి. ఆ తరువాత అన్నీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చరణ్ నేరుగా బాలీవుడ్ మూవీకి సైన్ చేయడం గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.

బాక్సాఫీస్ రేసులో రామ్ చరణ్ చిరుతతో సమానం. సౌత్ లో చెర్రీ ఎలాగో టాప్ రేంజ్ లో ఉన్నాడు. ఒక్కసారి శంకర్ సినిమా రిలీజ్ అయితే.. చిరు తనయుడు సోలోగా బాలీవుడ్ ని దున్నేయడం పక్కా. ఇంత స్టామినా ఉంది కాబట్టే.. ఈ మెగా హీరోని వెతుక్కుంటూ భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అయితే.., చరణ్ మాత్రం ఎన్ని కథలు విన్నా.., వాటిల్లో తన రోల్ పవర్ ఫుల్ గా, మాస్ టచ్ ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు సమాచారం. మరి.. బీ-టౌన్ లో  రామ్ చరణ్ సత్తాని సరిగ్గా వాడుకోబోతున్న ఆ డైరెక్టర్ ఎవరు? ఆ ప్రాజెక్ట్ డీటైల్స్ ఏంటి అనేవి మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్. మరి.., చరణ్ తో సైలెంట్ గా సైన్ చేయించేసుకున్న ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş