iDreamPost
android-app
ios-app

ఫోర్బ్స్ మ్యాగ్‌జైన్ పై రామ్‌చరణ్‌ దంపతులు! మరో మైలు రాయి..

  • Published Dec 23, 2023 | 1:48 PM Updated Updated Dec 23, 2023 | 1:48 PM

Ram Charan, Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారారు. ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చెర్రీ.. తాజాగా మరోో అరుదైన ఘనత సాధించారు.

Ram Charan, Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారారు. ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చెర్రీ.. తాజాగా మరోో అరుదైన ఘనత సాధించారు.

  • Published Dec 23, 2023 | 1:48 PMUpdated Dec 23, 2023 | 1:48 PM
ఫోర్బ్స్ మ్యాగ్‌జైన్ పై రామ్‌చరణ్‌ దంపతులు! మరో మైలు రాయి..

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా  టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఈ హీరో క్రేజ్ మరింత  పెరిగింది. ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపును సంపాదించుకున్నారు ‘రామ్ చరణ్’. కాగా, ఇప్పటివరకు  ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ ను అందుకున్నారు. రామ్ చరణ్ అభిమానులు ఇతనికి ఏకంగా గ్లోబల్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇప్ప‌టికే తాను న‌టించిన సినిమాకి ఆస్కార్ ద‌క్క‌డం ప‌ట్ల చెర్రీ సంతోషం వ్యక్తం చేశారు. ఇంత మంది అభిమానులను తన సొంతం చేసుకున్న ఈ మెగాపవర్ స్టార్.. ఇటీవల మరో అరుదైన ఘనతను సాధించారు. ఈసారి ఏకంగా ఫోర్బ్స్ మ్యాగజైన్  పైన కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా రామ్ చరణ్, ఉపాసన జంటను పిలుస్తారు. ఈ మధ్య కాలంలో ఈ జంట వరుసగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. పండంటి బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత.. నిత్యం నెట్టింట సందడి చేస్తూనే ఉన్నారు చెర్రీ దంపతులు. ప్రస్తుతం ఈ జంట ముంబై లో ఉన్నారు. తాజాగా, వారు ఓ ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ప్రస్తుతం ఫోర్బ్స్ మ్యాగజైన్ మీద ఈ జంట ప్రత్యక్షమయ్యారు. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన లేటెస్ట్ ఎడిషన్‌ మ్యాగజైన్ పైన  రామ్ చరణ్, ఉపాసనతో కలిసి దిగిన ఫోటో  వచ్చింది. దీంతో వారి కెరీర్ లో మరో మైలు రాయి ఎక్కారని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక తాజాగా విడుదలైన సంచికలో చెర్రీ, ఉపాసన గురించి ప్రత్యేకంగా ప్రచురించారు. ఇందులో రామ్ చరణ్, ఉపాసనలకు  సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. వారి పరిచయం గురించి, ప్రేమ, వైవాహిక జీవితం, వ్యాపారం ఇలా అన్నిటి గురించి..  వారిద్దరూ కలిసి కెరీర్ లో ఎలా ఎదిగారు అని.. ప్రతిదీ ఈ మ్యాగజైన్ లో ప్రచురించారు. ప్రస్తుతం ఈ విషయం సామజిక మాధ్యమాలలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా నిలిచింది. ఈ విషయాన్నీ  మెగా అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

కాగా, ప్రస్తుతం రామ్ చరణ్  శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న  ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే సంవత్సరంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్. ఇక ఆ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్  బుచ్చిబాబుతో కలిసి చేయనున్నారు. ఇలా, వరుస ప్రాజెక్ట్స్ తో సినీ రంగంలోనూ,  వ్యక్తిగత జీవితంలోను బిజీగా ఉన్నారు రామ్ చరణ్. మరి, తాజాగా మెగా పవర్ స్టార్ ఫోర్బ్స్ మ్యాగజైన్ పై అలరించి.. సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet