iDreamPost
android-app
ios-app

Ram Charan, Upasana: మెగా ఇంట సంబరాలు.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

  • Author Soma Sekhar Published - 10:52 AM, Tue - 20 June 23
  • Author Soma Sekhar Published - 10:52 AM, Tue - 20 June 23
Ram Charan, Upasana: మెగా ఇంట సంబరాలు.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

మెగా ఇంట సంబరాలు మోగాయి. మెగాస్టార్ కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టింది. ఉపాసన తల్లి అయిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు శుభవార్త విందామా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు పండగ లాంటి న్యూస్ వచ్చేసింది. మంగళవారం తెల్లవారు జామున జూబ్లీహిల్స్ అపోలో హస్పిటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.  తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

రామ్ చరణ్-ఉపాసన దంపతులకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ లభించింది. మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఉపాసన. దాంతో మెగా ఇంట సంబరాలు ఆకాశాన్ని తాకాయి. డెలివరీ కోసం ఉపాసన నిన్న ఆస్పత్రిలో చేరారు.  2012లో రామ్ చరణ్-ఉపాసనలకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు గతేడాది డిసెంబర్ 12న ఇరుకుంటుంబాలు వెల్లడించాయి. అప్పటి నుంచి మెగా అభిమానులు మెగా వారసుల కోసం ఎదురుచూడసాగారు. ఇప్పటికే తమకు పుట్టబోయే బిడ్డ గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రామ్ చరణ్ దంపతులు.

ఈ క్రమంలోనే ఉపాసన బొడ్డు పేగును భద్రపరుస్తున్నాను అన్న కీలక నిర్ణయం తీసుకోగా.. రామ్ చరణ్ సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి.. తన కుటుంబానికే పూర్తి టైమ్ కేటాయిస్తున్నట్లు తాజాగా తెలిపారు. ఇక చాలా మంది దంపతులు పిల్లలు పుట్టాక వేరుకాపురం పెడుతుంటారని, కానీ మేం పిల్లలు పుట్టాక అత్తయ్య,మామయ్యలతోనే ఉంటామని ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు ఉపాసన. గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు మేం దూరం చేయదలచుకోలేదు అంటూ ఉపాసన ఆ ఇంటర్య్వూలో తెలిపారు. ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో.. మెగా కాంపౌండ్ లో సంబరాలు మిన్నంటుతున్నాయి.