iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లో 142 మంది నటి,నటులతో వాట్సాప్ గ్రూప్..చరణ్, బన్నీ కూడా

  • Published Jul 03, 2024 | 6:04 PM Updated Updated Jul 03, 2024 | 6:04 PM

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీ,నటుల గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా వీరంతా కలిసకట్టుగా ఉండేందుకు ఓ పని చేశారట. అయితే ప్రస్తుతం ఆ విషయం కాస్త బయటకి రావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీ,నటుల గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా వీరంతా కలిసకట్టుగా ఉండేందుకు ఓ పని చేశారట. అయితే ప్రస్తుతం ఆ విషయం కాస్త బయటకి రావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

  • Published Jul 03, 2024 | 6:04 PMUpdated Jul 03, 2024 | 6:04 PM
టాలీవుడ్ లో 142 మంది నటి,నటులతో వాట్సాప్ గ్రూప్..చరణ్, బన్నీ కూడా

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఏ స్థాయికి ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందులో తీసే సినిమాలు, నటించే నటులు కానీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా.. బాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమ దూసుకువెళ్లడం నిజంగా అందరూ గర్వించదగ్గ విషయమనే చెప్పవచ్చు. ఇకపోతే ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలోని నటించే నటీ, నటులు ఏ స్టార్ హోదాల్లో ఉన్నా, ఎన్ని గొడవలు, విభేదాలు ఉన్నా.. అంతా కలికట్టుగా ఐకమత్యంగానే ఉంటారు.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నాటి నుంచి నేటి వరకు ఒక్కటిగానే కనిపిస్తుంటది.

అయితే ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమిటంటే.. ఈ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు పరస్పరం ఎన్ని విమర్శలు చేసుకున్నా.. వీరి కోసం బయట ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే చేసినా, కష్టమొస్తే మాత్రం అందరూ ఇక్కడ ఒక్కటవుతారు. పైగా ఒకరి కష్టాలను ఒకరు అర్ధం చేసుకుని సహాయం చేసుకుంటారు. అలాగే ఒకరి సక్సెస్ ను మరొకరితో పంచుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ కోసం, అందులో నటుల కోసం ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం అని సందేహ పడుతున్నరా..మరెమీ లేదండీ.. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది వెలుగులోకి వచ్చింది. ఇంతకి అదేమిటంటే..

తాజాగా టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ విషయన్ని మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అయితే తాజాగా మంచు లక్ష్మి సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్‌వ్యూలో పాల్గొంది. కాగా ఆ ఇంటర్వ్యూలో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి అందులో నటుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇంతకి లక్ష్మి బయటపెట్టిన ఆ విషయాలేమింటంటే.. టాలీవుడ్ లోని రామ్ చరణ్, అల్లు అర్జున్‌, రానా దగ్గుబాటి సహా మరో 142 మంది నటులతో కలిసిన ఓ వాట్సాప్ గ్రూప్ ఉందట. అయితే ఈ గ్రూప్ లో మంచు లక్ష్మి కూడా ఉన్నారట. ఇకపోతే ఈ గ్రూప్ ను ఎందుక క్రియేట్ చేశారో కూడా లక్ష్మి వివరించింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకే ఈ గ్రూప్‌ ఉందని ఆమె వెల్లడించింది.అతేకాకుండా.. ఆ గ్రూప్ లో యాక్టర్లు తమ లేటెస్ట్‌ సినిమాలను ప్రమోట్ చేయడానికి, రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించి విషయాలను మాట్లాడటానికి ఈ గ్రూప్‌ను వినియోగిస్తారని తెలిపింది.

అలాగే, నటీ,నటులు తమ కొత్ సినిమాల టీజర్లు, ట్రైలర్లను కూడా ఆ గ్రూప్ లో పంచుకుంటారని, ఒకరి సినిమా గురించి మరొకరు ప్రచారం చేయడం లాంటివి చేస్తారని మంచు లక్ష్మి తెలిపారు. అయితే ఇలా చేయడం వలను నటీనటుల మధ్య ఐక్యతభావాన్ని పెంపోందించి, శత్రుత్వాన్ని పోగెట్టేలా ఈ గ్రూప్ ను ఏర్పాటు చేశామని చెప్పింది.అలాగే, ఈ బృందాన్ని తన హృదయానికి దగ్గరగా ఉంచుకుంటానని మంచు లక్ష్మీ పేర్కొన్నారు. అలాగే రానా, రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. తామంతా కలిసి పెరిగామని, కలిసే ఉంటామని పేర్కొన్నారు. ఇక తమ గ్రూప్‌ని మరింత పెంచామని ఇందుకు చాలా గర్వపడుతున్నానని మంచు లక్ష్మీ పేర్కొన్నారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş