iDreamPost
android-app
ios-app

పెళ్లికి ముందు రకుల్ ప్రీత్ సింగ్ గ్రాండ్ పార్టీ

  • Published Feb 05, 2024 | 5:22 PM Updated Updated Feb 05, 2024 | 5:22 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంది ఈ సుందరి. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారట. ఈ పార్టీకి టాలీవుడ్ నుండి పలువురు హాజరయ్యారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంది ఈ సుందరి. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారట. ఈ పార్టీకి టాలీవుడ్ నుండి పలువురు హాజరయ్యారు.

  • Published Feb 05, 2024 | 5:22 PMUpdated Feb 05, 2024 | 5:22 PM
పెళ్లికి ముందు రకుల్ ప్రీత్ సింగ్ గ్రాండ్ పార్టీ

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు/నిర్మాత జాకీ భగ్నానిని ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా రకుల్ పెళ్లి గురించి ఎన్నో విశేషాలు బాలీవుడ్ మరియు టాలీవుడ్ మీడియాలో వస్తున్నాయి. తాజాగా రకుల్ ప్రీత్ తన సన్నిహితుల కోసం థాయ్‌లాండ్‌లో గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి హాజరైన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ కూడా ఉన్నారు. నిజానికి మొదట ఫారిన్ లొకేషన్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్న రకుల్ చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకుని ఇప్పుడు గోవాలో అడుగుపెట్టారు.

ఈ వివాహానికి హిందీ, తెలుగు సినిమా పరిశ్రమలకి చెందిన కొందరు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానీల మధ్య ప్రేమ ఈనాటిది కాదు. రెండేళ్ల క్రితం జాకీ పుట్టినరోజున సోషల్ మీడియాలో రకుల్ పెట్టిన పోస్ట్ ద్వారా ఈ లవ్ అఫైర్ బయట పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. గతంలో ఫిల్మ్ ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నటి తన ప్రేమ గురించి మాట్లాడారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, జాకీ భగ్నాని నిర్మించిన బడే మియాన్ చోటే మియాన్ ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. రకుల్ ప్రీత్ తాజాగా శివ కార్తికేయన్‌తో కలసి అయలాన్ సినిమాలో కనిపించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇక కమల్ హాసన్‌తో ఇండియన్ 2 (భారతీయుడు 2) సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అజయ్ దేవగణ్ మరియు అర్జున్ కపూర్‌లతో కూడా రకుల్ తదుపరి సినిమాలలో నటించినున్నారు.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş