iDreamPost
android-app
ios-app

రెండు సాంప్రదాయ పద్ధతుల్లో రకుల్- జాకీ భగ్నానీ వివాహం..!

  • Published Feb 21, 2024 | 5:48 PM Updated Updated Feb 21, 2024 | 5:48 PM

మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన భాయ్ ఫ్రెండ్, నటుడు కమ్ నిర్మాత జాకీ భగ్నానీని గోవాలో వివాహం చేసుకుంది. సాంప్రదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది

మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తన భాయ్ ఫ్రెండ్, నటుడు కమ్ నిర్మాత జాకీ భగ్నానీని గోవాలో వివాహం చేసుకుంది. సాంప్రదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది

  • Published Feb 21, 2024 | 5:48 PMUpdated Feb 21, 2024 | 5:48 PM
రెండు సాంప్రదాయ పద్ధతుల్లో రకుల్- జాకీ భగ్నానీ వివాహం..!

ఒక తరం స్టార్ హీరోయిన్లు అంతా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, హన్సిక వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు. అలాగే తమన్నా కూడా రేపో మాపో పెళ్లి భాజాలు మోగించడం షురూ చేస్తుంది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా నూతన అధ్యాయంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ తార రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది.  ఫిబ్రవరి 21న  గోవాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రెండు రకాల పద్ధతుల్లో ఈ జంట వివాహం చేసుకున్నారు. తొలుత సిక్కుల సాంప్రదాయం ప్రకారం ఆనంద్ కారజ్ అనే పద్ధతిలో అలాగే ఆ తర్వాత సింధీ ఆచారాల ప్రకారం మనువాడినట్లు సమాచారం.

2021లో తాము ప్రేమించుకుంటున్నామని ప్రకటించింది జంట. మూడేళ్ల తర్వాత గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు రకుల్ అండ్ జాకీ. మధ్యాహం 3.30 గంటలకు ఈ జంట ఎక్కటైంది. ఇప్పటికే ఈ వేడుకకు బాలీవుడ్ సినీ ప్రముఖులకు గోవాకు వెళ్లి.. సందడి చేస్తున్నారు. ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఇద్దరు ఈ వేడుకలో హుషారైన పాటలతో ఉర్రూతలూగించారు. ఈ వేడుకుకు బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే హాజరయ్యారు. షాహీద్ కపూర్ ఆయన భార్య మీరా, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సారా అలీఖాన్ కూడా వెళ్లారు.

గోవాలో సంగీత్, మెహందీ ఫంక్షన్లలతో సందడి చేశారు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సినీ సెలబ్రీటీలు. ఈ జంటకు దగ్గరి స్నేహితుడైన వరుణ్ ధావన్ కూలీ నంబర్ వన్ సాంగ్స్‌కు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. కెరటం అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ అంటూ అలరించింది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో. పండగ చేస్కో, కరెంట్ తీగ, బ్రూస్ లీ, కిక్ 2, ధ్రువ, విన్నర్, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయకా, స్పైడర్, చెక్, మన్మధుడు 2, కొండ పొలం వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు హిందీలోనూ, తమిళంలోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు చిత్రాలున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss