iDreamPost
android-app
ios-app

రకుల్ కొత్త కారుపై నెటిజన్ల చర్చ! అన్ని కోట్లు పెట్టి కొన్నదా.. కొనిచ్చాడా?

  • Author ajaykrishna Published - 01:27 PM, Sat - 9 September 23
  • Author ajaykrishna Published - 01:27 PM, Sat - 9 September 23
రకుల్ కొత్త కారుపై నెటిజన్ల చర్చ! అన్ని కోట్లు పెట్టి కొన్నదా.. కొనిచ్చాడా?

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి సంబంధించి ఎలాంటి కొత్త విషయాలు తెలిసినా ఫ్యాన్స్ ఇట్టే వైరల్ చేసేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల లవ్ స్టోరీస్.. డేటింగ్ గాసిప్స్ గురించి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. తెలుగులో కెరీర్ ప్రారంభించి.. స్టార్డమ్ అందుకున్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. కొన్నాళ్ళుగా తెలుగులో సినిమాలు చెయ్యట్లేదు. కానీ.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు దాదాపు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్.. ఇలా టాప్ స్టార్స్ అందరి సరసన సినిమాలు చేసేసింది. ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కట్ చేస్తే.. మధ్యలో బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది. దీంతో తెలుగులో ఫోకస్ తగ్గి.. ప్లాప్స్ పడ్డాయి.

కట్ చేస్తే.. బాలీవుడ్ లో అవకాశాలు గట్టిగానే అందిపుచ్చుకుంది. తెలుగులో నాగార్జునతో మన్మధుడు 2, వైష్ణవ్ తేజ్ తో కొండాపొలం తప్ప మరే సినిమాలు ఓకే చేయలేదు. ఇక బాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకున్న టైమ్ లో రకుల్ బాయ్ ఫ్రెండ్ అంటూ నటుడు జాకీ భగ్నని పేరు తెరపైకి వచ్చింది. 2021లో వీరిద్దరూ లవ్ లో ఉన్నారని కన్ఫర్మ్ చేస్తూ వార్తలొచ్చాయి. ఈ విషయంలో రకుల్ కూడా సానుకూలంగా స్పందించడమే కాకుండా.. సమయం వచ్చినప్పుడు పెళ్లి వార్తపై కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి కుండబద్దలు కొట్టేసింది. ఇదిలా ఉండగా.. రకుల్ తాజాగా ఓ లగ్జరీ కారు కొన్నది.

లగ్జరీ కారు బ్రాండ్స్ లో ఒకటైన మెర్సిడెజ్ బెంజ్ హైఎండ్ మోడల్ కారు రకుల్ కొనుగోలు చేసింది. దాదాపు కారు ధర రూ. 3 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతో కొత్త కారు కొన్నందుకు రకుల్ ని సోషల్ మీడియాలో అందరు విష్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య సరిగ్గా సినిమాలలో కనిపించడం లేదని రకుల్ పై కంప్లైంట్ ఉంది. అలాంటిది ఎలా ఇన్ని కోట్లు పెట్టి కారు కొన్నది..? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో రకుల్ బాయ్ ఫ్రెండ్ కొనిచ్చి ఉంటాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. రకుల్ బాయ్ ఫ్రెండ్ జాకీ.. నటుడే కాదు నిర్మాత కూడా. సో.. రకుల్ కారు కొనడానికి అతను కూడా హెల్ప్ చేసుంటాడని నెటిజన్స్ చర్చలు పెడుతున్నారు. సరే ఎలాగైతే ఏంటి కారు కొన్నది కదా అని ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి రకుల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet