ప్రముఖ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మరణించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. తాజాగా ఆయనకు రక్త విరోచనాలు, వాంతులు కావడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో.. రాకేష్ మాస్టర్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక ఆయన మరణంతో మరోసారి తెరపైకి రాకేష్ మాస్టర్-శేఖర్ మాస్టర్ మధ్య జరిగిన గొడవ తాలుకు వార్తలు వైరల్ గా మారాయి. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాకేష్ మాస్టర్.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. టాలీవుడ్ స్టార్ డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్ మాస్టర్ కు ఆయన గురువు అన్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్న విషయం ఇండస్ట్రీ మెుత్తం తెలిసిందే. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చారు.
” శేఖర్ మాస్టర్ ను నా కన్నబిడ్డలా చూసుకున్నాను. శేఖర్ పెళ్లి కూడా నేనే చేశాను. కానీ ఓ ఇంటర్వ్యూలో శేఖర్ నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. తన గురువు ప్రభుదేవా అని చెప్పుకొచ్చాడు. అలా చెప్పడం నాకు బాధకలిగించింది. అదీకాక శేఖర్ బిడ్డ బర్త్ డేకి కూడా నాకు చెప్పలేదు” అని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే రాకేష్ మాస్టర్ తన శవాన్ని కూడా శేఖర్ తాకడానికి వీల్లేదని అన్నారని తెలుస్తోంది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కొన్ని రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో స్పందించారు శేఖర్ మాస్టర్. ఓ రోజు రాకేష్ మాస్టర్ తాగి వచ్చి తన తల్లిని తిట్టారని శేఖర్ మాస్టర్ అన్నారు. దాంతో మాస్టర్ తో మాట్లాడ్డం మానేశానని శేఖర్ మాస్టర్ తెలిపారు.
ఇక రాకేష్ మాస్టర్ వల్లే నాకు అవకాశాలు రాలేదని, వినయ్ అనే ఓ వ్యక్తి ద్వారా నాకు తొలి ఛాన్స్ వచ్చిందని తెలిపారు. నాకు గురువు అంటే రాకేష్ మాస్టరే అని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఇక ఖైదీ నెం.150 మూవీలో సాంగ్ చేస్తున్నట్లు మాస్టర్ కు చెప్పకపోవడంతో ఫీల్ అయ్యారని శేఖర్ మాస్టర్ తెలిపారు. సాంగ్ కంప్లీట్ అయ్యాక మాస్టర్ కు చెప్పినట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అని, అందుకే నేను ఏం సినిమా చేస్తున్నానో సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఎవరికీ చెప్పను అని శేఖర్ మాస్టర్ వివరించారు. ఈ క్రమంలోనే ఏది ఏమైనప్పటికీ రాకేష్ మాస్టర్ పార్థీవ దేహాన్ని చూడటానికి శేఖర్ మాస్టర్ వస్తారా? లేదా? చూడాలి మరి.