iDreamPost
android-app
ios-app

కార్టూన్ నెట్ వర్క్ నుంచి కమర్షియల్ సినిమా వైపు

యానిమేషన్ ప్రపంచంలో ఎంత సక్సెస్ సాధించి, ఆద్భుతం సృష్టించిన రాజీవ్ చిలక ఇప్పుడు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన ఆ ఒక్కటీ అడక్కు టీజర్ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ తన పేరూ, బ్యాక్ గ్రౌండ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

యానిమేషన్ ప్రపంచంలో ఎంత సక్సెస్ సాధించి, ఆద్భుతం సృష్టించిన రాజీవ్ చిలక ఇప్పుడు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన ఆ ఒక్కటీ అడక్కు టీజర్ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ తన పేరూ, బ్యాక్ గ్రౌండ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కార్టూన్ నెట్ వర్క్ నుంచి కమర్షియల్ సినిమా వైపు

ఎంటర్ టైన్ మెంట్ వరల్డ్ లో ఎవ్వరి గమ్యమైనా చివరికి సినిమానే. ఏ రంగంలో సక్సెస్ అయి నిలదొక్కుకున్నా, ఆ సక్సెస్ తో సినిమా రంగంవైపుకే అడుగులు పడతాయి. రియల్ ఎస్టీట్ రంగం నుంచి, ఐటి రంగం నుంచి ఎందరు ఎందరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి, తమదైన అబిరుచిని చాటుకోవడానికి స్టేక్ చేస్తున్నారు. అటువంటిది ఒక ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ లోనే వీర సక్సెస్ ని సాధించి, సినిమా వైపుకి ప్రయాణం మొదలైతే….దాని ఫలితం ఎలా ఉంటుంది? దీనికి ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా వినబడుతున్న పేరు రాజీష్ చిలకా. ఎవ్వరీ రాజీవ్ చిలక? ఛోటా భీమ్ లాటి అద్భుతమైన యానిమేటెడ్ కామెడ్ అడ్వంచర్ని క్రియేట్ చేసిన దిగ్గజం. గ్రీన్ గోల్డ్ యానిమేషన్స్ పేరుతో అనేక భాషలలో సంచలనం రేపిన మోస్ట్ పాప్యులర్ ఐకన్. దాదాపు 700 మంది ఎంప్లాయ్స్ తో చాలా సమర్ధవంతంగా యానిమేషన్ రంగంలో పేరుప్రతిష్టలను సంపాదించుకుని, తిరుగులేని బిజినెస్ మేన్ గా నిలబడ్డ తెలుగువాడు.

యానిమేషన్ ప్రపంచంలో ఎంత సక్సెస్ సాధించినా రాజీవ్ చిలక మాత్రం సినిమాల్లోకి రావాలనే స్వప్నంతోనే ఎన్నాళ్ళగానో తపించి ఇప్పుడు సినిమా రంగంలోకి దూసుకొచ్చారు. అల్లరి నరేష్ హీరోగా మల్లి అంకం దర్శకుడిగా ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో అరంగేట్రం చేస్తున్నారు. కానీ ఆయన మూలాలు మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయన్నది రాజీవ్ చిలక తానే స్వయంగా మొన్నీమధ్యన జరిగిన ఆ ఒక్కటీ అడక్కు టీజర్ రిలీజ్ ఫంక్షన్లో చెప్పి, అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజీవ్ చిలక ఎవరో కాదు. తెలుగు సినిమా లెజెండ్ సిఎస్ ఆర్ మనవడు. షిఎస్ ర్ ఈ జనరేషన్ కి తెలియకపోవచ్చు, తెలియొచ్చు. మాయాబజార్ లాటి ల్యాండ్ మార్క్ బ్లాక్ బస్టర్లో శకుని వేషం పోషించిన మహానటుడు. ఆయనే స్వయంగా గాయకుడు. మాయాబజార్ లో శకుని పాత్రకు పెట్టిన పద్యాన్ని కూడా ఆయనే మధురాతిమధురంగా ఆలపించారు.

From Cartoon Network to Commercial Cinema

మాయాబజార్ సినిమా అంతగొప్పగా రక్తి కట్టడానికి శకుని పాత్రను బ్రహ్మాండంగా పండించిన సిఎస్ ఆర్ ప్రధానమైన మూలస్తంభం. విలన్లా కనిపించే పాత్రలతో కావాల్సినంత ఎంటర్ టైన్ మెంటుని పంచిన గ్రేట్ యాక్టర్ సిఎస్ ఆర్. ఆయన మనవడే మన రాజీవ్ చిలక. ఆ ఒక్కటీ అడక్కు టీజర్ రిలీజ్ ఫంక్షన్లో రాజీవ్ చిలక మాట్లాడుతూ తన పేరూ, బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా ఆసక్తికరంగా వివరించారు. ‘’మా తాతగారే చిలకలపూడి సీతారామాంజనేయులుగారు. మా ఇంటి పేరు కూడా చిలకపూడే. కానీ ఏదో సెంటిమెంట్….నేను మాత్రం చిలక అని మాత్రమే ఉంచుకున్నాను. పెళ్ళి అయిన దగ్గర్నుంచీ నాకు బాగా కలిసొచ్చింది. ఎప్పటి నుంచో సినిమాల్లోకి వద్దామని అనుకున్నా సరైన ప్రాజెక్టు కుదరక ముందడుగు వేయలేకపోయాను.

పైగా కొంతమంది భయపెట్టారు కూడా. సినిమాలు గనక దెబ్బతింటే రోడ్ల మీదకి వచ్చేయాల్సి ఉంటుందని. నాలుగైదు సినిమాలైనా ప్లాన్ చేసుకుని వస్తే….అందులో ఏదో ఒకటి ఆడితే నిలదొక్కుకోవచ్చు అని శ్రేయోభిలాషులు, స్నేహితులు చెప్పారు. నా లక్ కొద్దీ అల్లరి నరేష్ గారు నాకు హెల్పింగ్ హ్యాండ్ అందించారు. మంచి కథ దొరికింది. సూపర్ హిట్ టైటిల్ సెట్ అయింది. యానిమేషన్ బిజినెస్ వేరు. సినిమా బిజినెస్ వేరు. ఇందులో కూడా సక్సెస్ కావడానికి, రెగ్యులర్ గా సినిమాలు చేయడానికే ప్లాన్ చేసుకుంటున్నాను. అల్లరి నరేష్ గారి లాటి మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోతో నా ప్రయాణం ప్రారంభం కావడం నాకెంతో ఆనందంగా ఉంది.’’ అని చెప్పారు. క్రియేటివ్ స్పేస్ లో అనుభవం, సక్సెస్ సిగ్నేచర్ ఉన్న రాజీవ్ చిలకలాటి నిర్మాతలు చిత్రపరిశ్రమలో పాదం మోపడం ఎంతైనా ఆహ్వానించదగ్గదే. ఆయన అనుభవం, క్రమశిక్షణ ఇండస్ట్రీ ఎదుగుదలకు ఉపకరిస్తుంది. బెస్టాఫ్ లక్ టు రాజీవ్ చిలక