iDreamPost
android-app
ios-app

Lal Salaam Movie: సూపర్ స్టార్ కు షాక్.. లాల్ సలామ్ మార్నింగ్ షోలు రద్దు!

  • Published Feb 09, 2024 | 1:53 PM Updated Updated Feb 09, 2024 | 1:53 PM

గతేడాది జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజినీ.. అదే జోరును కొనసాగించలేకపోయాడు. లాల్ సలామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తలైవాకు బిగ్ షాకిచ్చారు తెలుగు ఆడియన్స్.

గతేడాది జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజినీ.. అదే జోరును కొనసాగించలేకపోయాడు. లాల్ సలామ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తలైవాకు బిగ్ షాకిచ్చారు తెలుగు ఆడియన్స్.

  • Published Feb 09, 2024 | 1:53 PMUpdated Feb 09, 2024 | 1:53 PM
Lal Salaam Movie: సూపర్ స్టార్ కు షాక్.. లాల్ సలామ్ మార్నింగ్ షోలు రద్దు!

లాల్ సలామ్.. సూపర్ స్టార్ రజినీకాంత్ అథిపాత్రలో నటించిన లేటెస్ట్ ఫిల్మ్. ఈ చిత్రానికి రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ నిర్మించారు. ఎలాంటి హడావిడిలేకుండా శుక్రవారం(ఫిబ్రవరి 9)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు భారీ షాకిచ్చారు. గతేడాది జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజినీ.. అదే జోరును కొనసాగించలేకపోయాడు. విడుదల రోజే తెలుగులో పలు చోట్ల మార్నింగ్ షోలు రద్దైయ్యాయి. దీంతో తలైవా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నాడు.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ లాల్ సలామ్. తన కూతురు ఐశ్వర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. దేశభక్తి, స్పోర్ట్స్ డ్రామాతో తెరకెక్కిన ఈ మూవీ తమిళంలో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. అక్కడ ప్రమోషన్లు కూడా అంతే స్థాయిలో జరిగాయి. కానీ తెలుగులోకి వచ్చేసరికి ప్రమోషన్లు నిల్. అసలు సూపర్ స్టార్ మూవీ అంటే తెలుగులోనే కాదు.. ఓవరాల్ ఇండియాలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. అయితే తెలుగులో జీరో ప్రమోషన్ల కారణంగా తలైవాకు బిగ్ షాక్ తగిలింది. పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో.. తొలిరోజే చాలా చోట్ల మార్నింగ్ షోలు రద్దు చేసుకున్నారు థియేటర్ ఓనర్లు. టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీ ఫండ్ చేస్తున్నారు. హైదరాబాద్ తో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రజినీ మూవీని థియేటర్లలో చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.

గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు రజినీకి ఎదురుకాలేదు. కొన్ని రోజుల క్రితమే జైలర్ గా వచ్చిన సూపర్ స్టార్ కు ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరమే. ఇక ట్విట్టర్ రివ్యూ దుమ్మురేపుతోంది లాల్ సలామ్. మరో భాషా రేంజ్ లో తలైవా యాక్ట్ చేశాడని, ఏఆర్ రెహమాన్ బీజీఎం అదరగొట్టాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మార్నింగ్ షోలు రద్దు అయినప్పటికీ.. సాయంత్రం వరకు పరిస్థితులు చక్కబడతాయని బయ్యర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూవీ యూనిట్ ప్రమోషన్లు చేపట్టకపోవడం కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని సినీ పండితులు తెలుపుతున్నారు. మరి సూపర్ స్టార్ మూవీ మార్నింగ్ షోలు రద్దుకావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: The Goat Life Movie: 16 ఏళ్ల తర్వాత రిలీజ్‌.. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్‌ హీరో సినిమా

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş