iDreamPost
android-app
ios-app

జైలర్ షోకేస్ రిలీజ్: మాటల్లేవమ్మా.. ఇంక కోతలే..!

  • Published Aug 02, 2023 | 8:01 PM Updated Updated Aug 02, 2023 | 8:01 PM
  • Published Aug 02, 2023 | 8:01 PMUpdated Aug 02, 2023 | 8:01 PM
జైలర్ షోకేస్ రిలీజ్: మాటల్లేవమ్మా.. ఇంక కోతలే..!

రజినీకాంత్ సినిమా వస్తోంది అంటే ఒక్క ఇండియాలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల్లో ఉత్సాహం మొదలౌతుంది. ఆగస్టు 10న రజినీకాంత్- నెల్సన్ కాంబోలో రాబోతున్న జైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నిజానికి వీళ్ల కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పుడు బొమ్మ హిట్టు అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు జైలర్ నుంచి షో కేస్ రిలీజ్ చేసిన తర్వాత ఆ టాక్ మరింత బలంగా వినిపిస్తోంది.

జైలర్ నుంచి ఇప్పటివరకు పోస్టర్లు, సాంగ్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా షోకేస్.. అదే అంటి ట్రైలర్ లాంఛ్ చేశారు. ఈ ట్రైలర్ లో రజినీకాంత్ క్యారెక్టర్ గురించి బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక సాధారణ పోలీసు ఆఫీసర్ తండ్రిగా చూపిస్తారు. పైగా ఆయనకు ఏదో జబ్బు ఉన్నట్లు చెబుతారు. పిల్లిలా ఉంటారు అని చెప్పడంతో కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. వెంటనే అదే డాక్టర్ వాళ్లు ఒక్కసారి పులిలా మారిపోతారు అంటూ చెబుతాడు. ఇంకేముంది.. ట్రైలర్ అప్పటి నుంచి పరుగులు పెడుతుంది. రజినీకాంత్ ఫ్లాష్ బ్యాక్ లో జైలర్ అని అందరికీ తెలుసు. అచ్చు భాషా సినిమా స్టైల్లో రజినీకాంత్ ఎవరు ఏంటి అని తెలియక కొందరు ఆయన్ను టార్గెట్ చేస్తారు. పెట్టుకున్న తర్వాత ఆయనేంటో తెలుసుకుని నానా తిప్పలు పడతారు.

రజినీ మాత్రం స్టార్ట్ చేసిన టాస్కుని ముగించి తీరాలంటూ తన భార్య రమ్యకృష్ణకు చెబుతారు. అంటే గతంలో వదిలేసిన కొందరు శత్రువులను మరోసారి కలిసి కథకు సుఖాంతం పలకాలని చూస్తారు. మొత్తానికి స్టోరీ లైన్ కాస్త రొటీన్ గానే అనిపిస్తున్నా.. నెల్సన్ ఇచ్చిన ఎలివేషన్స్ కు అభిమానులు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పటివరకు సినిమా అంచనాలను ఈ షో కేస్ రెట్టింపు కూడా కాదు.. పదింతలు చేసినట్లు అయింది. ఈ ట్రైలర్ మొత్తంలో కూడా మీకు రజినీ కాంత్ తప్ప మరే క్యారెక్టర్లు పెద్దగా రిజిస్టర్ కూడా కావు. అంటే నెల్సన్ ఏ రేంజ్ లో ట్రైలర్ కట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇంక అనిరుధ్ మ్యూజిక్ ఎప్పటిలాగానే ఇరగదీశాడు. మరి.. జైలర్ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించబోతోందో తెలియాలంటే ఆగస్టు 10 వరకు ఆగాల్సిందే. జైలర్ షోకేస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş