iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ ‘లాల్‌ సలాం’ హార్డ్ డిస్క్‌లు మాయం!

  • Published Nov 09, 2023 | 1:43 PM Updated Updated Nov 09, 2023 | 1:43 PM

సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు. ఇటీవల జైలర్ మూవీతో ఘన విజయం అందుకున్నారు.

సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు. ఇటీవల జైలర్ మూవీతో ఘన విజయం అందుకున్నారు.

  • Published Nov 09, 2023 | 1:43 PMUpdated Nov 09, 2023 | 1:43 PM
రజినీకాంత్ ‘లాల్‌ సలాం’ హార్డ్ డిస్క్‌లు మాయం!

సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆరు పదులు దాటినా కూడా కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. రజినీకాంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన మేనరీజం, స్టైల్. దాదాపు 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం కొనసాగిస్తూ వస్తున్నారు. అన్ని భాషల్లో ఇప్పటి వరకు 160 కిపైగా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు.. ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 1975లో కే బాలచందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో కమల్ హాసన్, శ్రీవిద్య నటించారు. ప్రస్తుతం రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలాం’ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం ‘లాల్ సలాం’. ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. క్రికెట్ గేమ్ నేపథ్యంలో మూవీ కొనసాగబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ హిట్ చిత్రం ‘కై పో చే’ కి రిమేక్ అని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మొయిదీన్ భాయ్ గా రజినీకాంత్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జైలర్ తో భారీ విజయం అందుకున్నారు రజినీకాంత్. తాజాగా లాల్ సలాం పై కూడా భారీ అంచనాలు నెలకొంటున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ కీలక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు విషయానికి వస్తే.. రజినీకాంత్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఓ హార్డ్ డిస్క్ లో భద్రపరిచారు.. ప్రస్తుతం ఆ హార్డ్ డిస్క్ కనిపించకుండా పోయినట్లు ప్రచారం జరుగుతుంది.

ఐశ్వర్య డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘లాల్ సలాం’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. అంతలోనే రజినీకాంత్ సీన్లకు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయం కావడంతో చిత్ర యూనిట్ దాన్ని కనిపెట్టే పనిలో పడ్డట్టు సమాచారం. ఒకవేళ హార్డ్ డిస్క్ లభ్యం కాకుంటే.. రజినీకాంత్ నటించిన సన్నివేశాలను తిరిగి రికవరీ చేసేందుకు విదేశాల నుంచి సాంకేతిక నిపుణులను రప్పించే ప్రయత్నాల్లో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. దీంతో 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని చూసినా.. పరిస్థితుల కారణంగా రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ మూవీతో జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. కోలీవుడ్ లో సంక్రాంతి బరిలో శివకార్తికేయ నటించిన అలయాన్, జయం రవి నటిస్తున్న సైరన్ మూవీలు పోటీలో ఉన్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetador girişgrandpashabet