P Krishna
Clarification from Superstar Rajinikanth: సాధారణంగా సినీ హీరోల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. కొన్నిసార్లు హీరోలు చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోషల్ మాధ్యమాల్లో అభిమానులు మాటల యుద్దానికి దిగుతున్నారు.
Clarification from Superstar Rajinikanth: సాధారణంగా సినీ హీరోల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. కొన్నిసార్లు హీరోలు చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోషల్ మాధ్యమాల్లో అభిమానులు మాటల యుద్దానికి దిగుతున్నారు.
P Krishna
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి *ఇదితో తోక అంటే.. అదిగో పులి’ అన్నట్లు కొన్ని వార్తలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల సెలబ్రెటీలు కొన్నిసార్లు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీ అన్న తర్వాత హీరోల మధ్య పోటీ ఉండటం సహజం.. అలా పోటీ ఉన్న హీరోలు కొన్నిసార్లు చేసే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో నెగిటీవ్ గా వైరల్ కావడంతో అభిమానుల మధ్య గొడవలు మొదలవుతాయి.. దీంతో సోషల్ మాధ్యమాల వేధికగా మాటల యుద్దం మొదలవుతుంది. రజినీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’మూవీ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆరు పదులు దాటినా.. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీగా నటిస్తున్నారు. గత ఏడాది ‘జైలర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు రజినీకాంత్. తాజాగా ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం ‘లాల్ సలామ్’ మూవీలో నటించారు. ఈ మూవీ ఆడియో ఆవిష్కరణ శుక్రవారం చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగింది. ఈ సందర్బంగా రజినీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాల్ సలామ్ మూవీలో నా పాత్ర మొయిదీన్ భాయ్. 1992 లో దక్షిణాది జిల్లాలో ఒకప్పుడు ఈయన పేరు బాగా మారుమోగింది. కొంతమంది అవకాశవాదులు ఆయన పేరు తెరపైకి రాకుండా చూడాలని కోరుకున్నారు. ఈ చిత్రం మతసామరస్యంతో నిండి ఉంటుంది. ఈ సందర్భంగా సినీ అభిమానులకు మరో క్లారిటీ కూడా ఇవ్వానుకుంటున్నా..గతంలో జైలర్ ఈవెంట్ సందర్భంగా నేను మాట్లాడిన అర్థమైందా రాజా వ్యాఖ్యని తప్పుగా అర్థం చేసుకున్నారు.
రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘జైలర్ మూవీ ఈవెంట్ లో ‘అర్థమైందా రాజా’ అంటూ నేను మాట్లాడాను.. అది తప్పుగా అర్థం చేసుకొని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ మాటలను దళపతి విజయ్ పై నేను కావాలనే చేసినట్లు రూమర్లు సృష్టించారు. ఇది నాకు చాలా బాధ అనిపించింది.. నేను విజయ్ ని చిన్నతనం నుంచి చూస్తున్నాను. విజయ్ ఎంతో పట్టుదల వ్యక్తి.. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. అలాంటి వ్యక్తిపై నేను ఎందుకు నెగిటీవ్ గా కామెంట్స్ చేస్తాను? నాకు ఎవరితోనూ పోటీ ఉండదు.. నాకు నేనే పోటీగా కొనసాగుతాను. నా అభిమానులకు చెప్పేది ఒక్కటే, ఇకపై మా ఇద్దరినీ పోల్చి చూడకండి’ అని అన్నారు. లాల్ సలామ్ మూవీ లో విక్రాంత్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రజినీకాంత్ అదిధి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ మూవీ లైకా ప్రొడక్షన్ ద్వారా సుభాస్కరన్ నిర్మించారు. ఫిబ్రవరి 9 న ధియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Clarification from Superstar Rajinikanth at the #LalSalaamAudioLaunch about the KAAKA KAZHUGU speech. pic.twitter.com/8NzNC7Psz0
— Actor Vijay Universe (@ActorVijayUniv) January 26, 2024