iDreamPost
android-app
ios-app

రజినీకాంత్‌కు పోటీగా బరిలోకి దిగుతున్న ధనుష్‌!

Rajinikanth And Dhanush: రజినీకాంత్‌, ధనుష్‌ల కొత్త సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌తో పాటు సినీ విశ్లేషకులు కూడా ఎంతో ఆసక్తిగా పోటీ ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తున్నారు...

Rajinikanth And Dhanush: రజినీకాంత్‌, ధనుష్‌ల కొత్త సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌తో పాటు సినీ విశ్లేషకులు కూడా ఎంతో ఆసక్తిగా పోటీ ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తున్నారు...

రజినీకాంత్‌కు పోటీగా బరిలోకి దిగుతున్న ధనుష్‌!

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆగస్టు 9వ తేదీన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. 3 భాషల్లోనూ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక, రజినీకాంత్‌ తన కొత్త సినిమా లాల్‌ సలామ్‌తో సంక్రాంతి బరిలో నిలవనున్నారు. అయితే అదే సమయంలో రజనీకి పోటిగా మాజీ అల్లుడు హీరో ధనుష్ కూడా సంక్రాంతి బరిలో దిగనున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఇటీవలే ‘సార్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు బహుభాషా నటుడు ధనుష్. ధనుష్‌ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక, ఈ చిత్రంలో ధనుష్‌కు జంటగా నటి ప్రియాంక అరుణ్ మోహన్ నటించారు. నివేదిత సతీష్, జాన్ కొక్కెన్, సుమేష్ కూమారు, శివరాజ్ కూమారు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం బాధ్యతలను చేపట్టారు. సత్యజ్యోతి ఫిలిమ్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు.

danush competiton for rajini

కాగా, కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని సంక్రాతికి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. ఇదే సమయంలో రజనీకాంత్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్ సలామ్’ చిత్రం పొంగల్‌కి రెడీ అయిపోయింది. ఈ సినిమాకి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. అయితే, రజనీకాంత్‌తో పోటీ ఎందుకని కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ఈ డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది.

danush competiton for rajini

ఈ విషయంపై చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ముందుగా అనుకున్న సమయానికి.. అంటే సంక్రాతికి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో.. సంక్రాతికి మామ, మాజీ అల్లుడి మధ్య పోటీ తప్పని సరిగా మారింది. ఇకపోతే లాల్ సలామ్ చిత్ర టైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్ర టీజర్, పాటలు ఇప్పటికే విడుదలై తెగ ట్రెండ్ అవుతున్నాయి. రెండూ భారీ అంచనాలు ఉన్న చిత్రాలు కావటంతో పోటీ మామూలుగా ఉండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టగ్‌ ఆఫ్‌ వార్‌ తప్పదని అంటున్నారు. ముఖ్యంగా ఇద్దరి ఫ్యాన్స్‌ రిజల్ట్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి, సంక్రాంతి బరిలో రజనీ-ధనుష్‌లు పోటీగా నిలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetholiganbetKingroyal girişcasibomgalabetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomHoliganbetjojobetjojobetcasibomcasibomjojobet